సినిమా ఒక్కటే..వసూళ్లు 5వందల కోట్లు

సల్మాన్ తాజా చిత్రం బజరంగీ భాయిజాన్ సృష్టించిన హంగామా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5 వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేవలం విడుదలైన 15 రోజుల్లో ఒక సినిమా ఇంత గ్రాస్ సాధించడం.. భారతీయ చిత్రపరిశ్రమలోనే ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ సినిమాకు 373 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే.. ఓవర్సీస్ లో వసూళ్లు 136 కోట్ల రూపాయలు. తన మార్కు మాస్ మసాలాస్ ను పక్కనపెట్టి.. ఎంతో డేర్ చేసి కేవలం కథమీద నమ్మకంతో సల్మాన్ చేసిన సినిమా ఇది. సల్మాన్ నుంచి జనాలు ఆశించే కామెడి, పంచ్ లు, స్టెప్పులు ఇందులో చాలా తక్కువ. కానీ కథాబలానికి, సల్మాన్ స్టార్ డమ్ తోడవ్వడంతో సినిమా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. 
               నిజానికి బజరంగీ.. సినిమా ఇప్పుడు మొదటి స్థానంలో లేదు. దీనికంటే ముందు పీకీ, ధూమ్-3 సినిమాలున్నాయి. అయితే ఓవరాల్ వసూళ్లతో అది మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జస్ట్ 15 రోజుల వసూళ్ల తోనే బజరంగీ సినిమా మూడోస్థానానికొచ్చింది. సో.. మరికొన్ని రోజుల్లో సల్మాన్ చిత్రం మొదటి స్థానానికి ఎగబాకడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.