చిన్న సినిమాకు అత్యధిక హిట్స్

సినిమా చిన్నదా..పెద్దగా అనేది కాదు.. కాన్సెప్ట్ బాగుంటే జనాలు బ్రహ్మరథం పడతారు. స్టార్ డమ్ ను కూడా పట్టించుకోరు. ఇదే పంథాలో సిద్ధమైన ఓ హాలీవుడ్ సినిమా ఇప్పుడు నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఈ సినిమా ట్రయిలర్ కే జనాలు పిచ్చెక్కిపోయారు. 24 గంటల్లోనే 10లక్షల హిట్స్ తో సంచలనం సృష్టిస్తున్న ఆ సినిమా పేరు ది-33. 2010లో చిలీలో జరిగిన ఓ యదార్థ గాధతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ గనిలో చిక్కుకున్న 33 మంది ఏమయ్యారు.. వాళ్లు తిరిగి బయటకొచ్చారా లేదా.. అనే కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీ ట్రయిలర్ ను తాజాగా విడుదల చేసింది నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్. విడుదలైన కొన్ని గంటల్లో 10లక్షల హిట్స్ వచ్చాయి ఈ ట్రయిలర్ కి. నిజంగా ట్రయిలర్ తోనే బాగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా విడుదలకానుంది. ఈ ఆర్టికల్ చదివేసరికి ఈ సినిమా ట్రయిలర్ నెట్ లో మరో రికార్డు సృష్టించే ఉంటుంది.