Telugu Global
Cinema & Entertainment

ఆన్ లైన్ లో అదరగొట్టిన మహేష్

తన సినిమా ప్రమోషన్ కు సంబంధించి ట్విట్టర్ ను కూడా తగినంతగా వాడుకుంటాడు మహేష్. ఖలేజా సినిమా నుంచి ఇదే ట్రెండ్ స్టార్ట్ చేశాడు. తన ప్రతి సినిమా విశేషాల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం ట్విట్టర్ ను మరో విధంగా వాడేసుకున్నాడు ప్రిన్స్. తన కొత్త సినిమా శ్రీమంతుడు ప్రమోషన్ కోసం ట్విట్టర్ లో ఛాటింగ్ పెట్టాడు. ఓ టైమ్ ఇచ్చి అభిమానులు ఎవరైనా తనతో ఛాట్ చేయొచ్చని ఊరించాడు. […]

ఆన్ లైన్ లో అదరగొట్టిన మహేష్
X
తన సినిమా ప్రమోషన్ కు సంబంధించి ట్విట్టర్ ను కూడా తగినంతగా వాడుకుంటాడు మహేష్. ఖలేజా సినిమా నుంచి ఇదే ట్రెండ్ స్టార్ట్ చేశాడు. తన ప్రతి సినిమా విశేషాల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం ట్విట్టర్ ను మరో విధంగా వాడేసుకున్నాడు ప్రిన్స్. తన కొత్త సినిమా శ్రీమంతుడు ప్రమోషన్ కోసం ట్విట్టర్ లో ఛాటింగ్ పెట్టాడు. ఓ టైమ్ ఇచ్చి అభిమానులు ఎవరైనా తనతో ఛాట్ చేయొచ్చని ఊరించాడు. అలా చాలామంది ఘట్టమనేని ఫ్యాన్స్ మహేష్ తో ట్విట్టర్ లో మాటమాట కలిపారు. ఈ సందర్భంగా శ్రీమంతుడు సినిమాకు సంబంధించి మరిన్ని కొత్తవిషయాలు బయటపెట్టాడు మహేష్. సినిమా టైటిల్ విషయంలో తను జోక్యం చేసుకోలేదని, టైటిల్ క్రెడిట్ మొత్తం దర్శకుడు కొరటాల శివకే వెళ్తుందన్నాడు. ఇక జగపతిబాబు గురించి మాట్లాడుతూ అంత సీనియర్ నటుడితో కలిసి పనిచేయడం చాలా బాగుందన్నాడు. దీంతో పాటు సినిమాలో తనకు ఇష్టమైన పాట, ఇష్టమైన సన్నివేశాలు ఏంటనేది కూడా వివరించాడు. మరీ ముఖ్యంగా శ్రీమంతుడులో క్లయిమాక్స్ కు ముందొచ్చే సీన్లు అంటే తనకు చాలా ఇష్టమని, ఫ్యాన్స్ కు కూడా అవి బాగా నచ్చుతాయని చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద మహేష్ ట్విట్టర్ ఫార్ములా సినిమాకు బాగానే కలిసొచ్చిందని చెప్పాలి.
First Published:  1 Aug 2015 7:21 PM GMT
Next Story