మహేష్-పవన్ కాంబినేషన్ లో సినిమా

 మీరు విన్నది నిజమే.. ఇక్కడ చూస్తున్న ఫొటో కూడా నిజమే. త్వరలోనే మహేష్-పవన్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. పవన్ తో సినిమా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మహేష్ ప్రకటించాడు. ఈ ఇద్దరు స్టార్లు మల్టీస్టారర్ చేయడానికి ఓకే అనే విషయం అందరికీ తెలిసిందే. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్. అటు గోపాలో గోపాల సినిమాలో వెంకీ తో కలిసి నటించాడు పవన్ కల్యాణ్. కాబట్టి మల్టీస్టారర్ మూవీస్ లో నటించడానికి వీళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ మరోసారి స్పష్టంచేశాడు. పవన్ తో సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తామిద్దర్నీ పక్కాగా ప్రజెంట్ చేసే కథ దొరికితే తనే స్వయంగా వెళ్లి పవన్ ను ఒప్పిస్తానని కూడా చెప్పాడు. దీంతో అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. అయితే వీళ్లద్దర్నీ కలిసి సినిమా తీసే దర్శకుడు ఎవరనేది ఇప్పుుడ హాట్ టాపిక్ గా మారింది.