Telugu Global
NEWS

ఉస్మానియా ర‌క్ష‌ణ‌కు కాంగ్రెస్‌ దీక్ష‌లు

న‌గ‌రంలో గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌భుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్‌కు చ‌క్క‌టి అస్ర్తం దొరికింది. అదే పేద‌ల ఆరోగ్యంతో ముడిప‌డిన ఉస్మానియా ఆసుప‌త్రి. ఏ క్ష‌ణాన్నైనా భ‌వ‌నం కూలిపోతుంద‌ని ఇంజినీర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో స‌ర్కారును రోగుల‌ను త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ త‌మ ఆయుధంగా మార్చుకుంది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ క‌నీసం ఈ విష‌యంలోనైనా ఒక్క‌తాటిపై న‌డిచేందుకు సిద్ధ‌మ‌వ‌డం పార్టీ శ్రేణుల్లో కొత్త […]

ఉస్మానియా ర‌క్ష‌ణ‌కు కాంగ్రెస్‌ దీక్ష‌లు
X
న‌గ‌రంలో గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌భుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్‌కు చ‌క్క‌టి అస్ర్తం దొరికింది. అదే పేద‌ల ఆరోగ్యంతో ముడిప‌డిన ఉస్మానియా ఆసుప‌త్రి. ఏ క్ష‌ణాన్నైనా భ‌వ‌నం కూలిపోతుంద‌ని ఇంజినీర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో స‌ర్కారును రోగుల‌ను త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ త‌మ ఆయుధంగా మార్చుకుంది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ క‌నీసం ఈ విష‌యంలోనైనా ఒక్క‌తాటిపై న‌డిచేందుకు సిద్ధ‌మ‌వ‌డం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ నేప‌థ్యంలో ఆసుప‌త్రిని న‌గ‌రంలోని పెద్ద నేత‌లంతా సందర్శించారు. చారిత్ర‌క ఉస్మానియా భ‌వ‌నాన్ని కాపాడుకుంటామ‌ని ప్ర‌తిన బూనారు. ఆసుప‌త్రి త‌ర‌లింపున‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని అలాగ‌ని చారిత్ర‌క భ‌వ‌నాన్ని ప‌డ‌గొడుతామంటే ఒప్పుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌డ‌గొట్టేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే.. త‌ప్ప‌కుండా ప్ర‌తిఘ‌టిస్తామ‌ని చెప్పారు. రిలేనిరాహార దీక్ష‌లు చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ ఎంపీ హ‌నుమంత‌రావు ఒక‌డుగు ముందుకేసి తాను ఏకంగా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. క‌నీసం ఉస్మానియా విష‌యంలో నేత‌లంగా చివ‌రి వ‌ర‌కు ఐక్యంగా పోరాడుతారా? మ‌ధ్య‌లోనే విభేదాల‌తో విర‌మిస్తారా? వేచి చూడాలి.
First Published:  2 Aug 2015 12:54 AM GMT
Next Story