బాల‌య్యకు … ఈసారి ముందు చూపు ఎలావుంటుందో..?

మంచి విజ‌న్  వున్న డైరెక్ట‌ర్స్ లో సింగీతం శ్రీ‌నివాస‌రావు  ఒకరని చెప్పుకోవచ్చు.  ఆయ‌న కెరీర్ లో  బాల‌య్య తో చేసిన  ఆదిత్య 369 చిత్రం  ఆయ‌న ఆలోచ‌న విధానానికి  అద్దం ప‌డుతుంది.  అప్ప‌ట్లోనే   ట‌మాటాలు కేజి 15 వంద‌ల రూపాయ‌లు ధ‌ర ప‌లుకుతాయని..   వాతావరణ కాలుష్యం  పెరిగి పోయి.. మ‌నిషి బ్ర‌త‌క‌డ‌మే  క‌ష్టం అవుతుంద‌నే  దూర దృష్టి తో   ఆ సినిమాని రూపొందించారు. ఇప్ప‌డు ఆదిత్య 369 సినిమా  చూస్తే .. సైంటిఫిక్ థింకింగ్ లో  సింగీతం ఎంత అడ్వాన్స్ గా ఆలోచించారో  ఆదిత్య 369 చిత్రం ఒక ఉద‌హార‌ణ‌.
ఇక  బాల‌య్య తో ఈ  చిత్రం  సీక్వెల్ ఉంటుంద‌నే గాసిప్స్ గ‌త యేడాది నుంచి బాగా వినిపిస్తున్నాయి.   బాలయ్య‌ కు   ద‌ర్శ‌కుడు  సింగీతం శ్రీ‌నివాస‌రావు గారు స్టోరి చెప్ప‌డం   ఆయ‌న  విన‌డం జ‌రిగిందని ఫిలిం నగర్ టాక్.   ప్ర‌స్తుతం  త‌న కెరీర్ లో 99 వ చిత్రం గా డిటెక్ట‌ర్ చేస్తున్నాడు బాలకృష్ణ. అయితే  వందో సినిమా కంప్లీట్ అయిన త‌రువాత‌..101 వ చిత్రంగా  ఆదిత్య 999  పేరు తో   ఆదిత్య 369  కు సీక్వెల్ చేస్తార‌నే  టాక్ . ఆదిత్య 369 కు  సీక్వెల్ చేయాల‌నే ఉత్స‌హాంతో  బాల‌కృష్ణ కూడా ఉన్నార‌ని  తెలుస్తుంది. ఆల్మోస్ట్ డైరెక్ట‌ర్ కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశార‌ట‌. సో  మొత్తం మీద ఆదిత్య 999  చూడాలంటే  ఈజిగా మ‌రో రెండు సంవ‌త్స‌రాలు వెయిట్ చేయాల్సిందే మ‌రి.!