మ‌తం మార‌ణ‌హోమం

మ‌తం మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. మ‌త్తం మ‌త్తులో అమాయ‌క జ‌నం చిత్త‌వుతున్నారు. దేశ‌వ్యాప్తంగా మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు పెరిగిపోయాయి. మతాన్ని ఆయుధంగా మ‌లుచుకుని అసాంఘిక శక్తులు  రెచ్చిపోతున్నాయి. ఈ ఏడాది ఆరు నెల‌ల గ‌ణాంకాలు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసే విధంగా ఉన్నాయి.  ఆరు నెల‌ల్లో దేశంలో మత ఘర్షణలు తీవ్రంగాపెరిగాయి. జనవరి నుంచి జూన్‌ వరకు 330 మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 51 మంది మృతి చెందారు. 1,092 మంది గాయపడ్డారు. 2014 సంవత్సరం ఇదే కాలంలో 252 ఘర్షణలు సంభవించాయి.  మ‌త ఘ‌ర్ష‌ణ‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అగ్ర‌భాగంలో ఉంది. యూపీలో ఇప్పటి వరకు మత సంబంధమైన హింసాత్మక సంఘటనల్లో పది మంది మరణించగా, 68 ఘ‌ట‌న‌ల‌పై కేసులు న‌మోదు కాగా, ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో 224 మంది  గాయపడ్డారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అండ చూసుకుని మతతత్త్వ శక్తులు విజృంభిస్తున్నాయని లౌకిక‌వాదులు ఒకవైపు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌కు ఊత‌మిచ్చేలా ఈ ఏడాది అర్ధ‌భాగంలోనే మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి.