శివంతో పరుగులుపెడుతున్న రామ్

రామ్ హీరోగా ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. శివం, హరికథ అనే రెండు సినిమాల్ని ఏకకాలంలో పూర్తిచేస్తున్నాడు రామ్. అయితే వీటిలో శివం అనే సినిమాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకుంటే.. ఈ సినిమాను మరో నెల రోజుల్లో వినాయకచవితి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకే హరికథ షెడ్యూల్ ను కాస్త పక్కనపెట్టి శివంపైనే ఫోకస్ పెట్టాడు రామ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టుడియోలో వేసిన సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ షూటింగ్ ఉంటుంది. తర్వాత 4వ తేదీ నుంచి యూనిట్ మొత్తం స్కాండినేవియా వెళ్తుంది. అక్కడ అందమైన లొకేషన్లలో రామ్, హీరోయిన్ రాశిఖన్నాల మధ్య ఓ రెండు రొమాంటిక్ సాంగ్స్ షూట్ చేస్తారు. ఈ గ్యాప్ లో హైదరాబాద్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమౌతాయి. ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 17కు శివంను థియేటర్లలోకి దించాలనే కసితో ఉన్నాడు రామ్. అందుకే గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ బాణీలందిస్తున్న శివం పాటల్ని ఈనెలాఖరుకు విడుదల చేసే ఆవకాశముంది.