త‌మ‌న్నా”ఆ” కలలు కనడం మానదట..

మనం అనుకున్నవన్ని  నిజం అవుతాయ‌.. కాదా అనేది సెకండ‌రి. కానీ ప్ర‌తి మ‌నిషి  ఏదో ఒక‌టి అనుకుంటూనే వుంటాడు. చేసే ప‌నిలో ఎదుగుద‌ల ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌రి యాక్టర్స్ ఏమి కోరుకుంటారు.  వాళ్ల‌కు చాల డ్రీమ్ రోల్స్ వుంటాయి. అయితే  కొంద‌ర్నే ఆ డ్రీమ్ రోల్స్ వ‌రిస్తాయి.  వ‌రించడంలేద‌ని ఎవ‌రు క‌ల‌లు క‌న‌డం మానరు. ఇక అస‌లు విష‌యం ఏమిటంటే..   మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా..  బాహుబ‌లి  లో అవంతిక రోల్ త‌నను వ‌రిస్తుంద‌ని ఎప్పుడు అనుకోలేద‌ట‌.  ఊహించ‌ని ఆ బంప‌ర్ ఆఫ‌ర్ త‌న‌ను వ‌రించ‌డంతో ఎంతో  ఆనందానికి  గురైయింద‌ట‌.సెట్ లో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఎంతో థ్రిల్ అయ్యింద‌ట‌.ఇక పై ఇలా థ్రిల్ చేసే రోల్స్  చేయాల‌ని ఆశ ప‌డుతుంద‌ట‌.  అయితే ఈ అవ‌కాశం అంద‌రికి రాద‌ని  చెప్పింది. మొత్తం మీద  తమన్న‌  బాహుబ‌లి లో  అవంతిక రోల్ తో   క్రేజ్ తో పాటు ఆఫ‌ర్స్ బాగానే  త‌న ఖాతాలో వేసుకుంటుంది.  ప్ర‌స్తుతం  ర‌వితేజ స‌ర‌స‌న బెంగాల్ టైగ‌ర్.. నాగార్జున‌, కార్తీల కాంబినేష‌న్ లో వంశీ పైడిప‌ల్లి  డైరెక్ష‌న్ లో  న‌టిస్తుంది.