Telugu Global
NEWS

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను తొక్కేశారా?

గోదావ‌రి మ‌హా పుష్క‌రాల ప్రారంభం రోజున జ‌రిగ‌న మ‌హా విషాదంపై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం నీడ క‌మ్మేస్తోంది. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఆ ఊసే మ‌రిచిపోయింది. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో వాస్త‌వాలు వెలుగు చూడ‌కుండా స‌ర్కారే తొక్కేస్తుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. జూలై 14 పుష్క‌రాల ప్రారంభం రోజున వీఐపీ ఘాట్‌లో స్నానం చేయాల్సిన సీఎం చంద్ర‌బాబు పుష్క‌ర ఘాట్ స్నానం చేసిన స‌మ‌యంలో రెండున్న‌ర  గంట‌ల‌కు పైగా భ‌క్తుల‌ను నిలిపేసి ఓ డాక్యుమెంట‌రీ చిత్రీక‌రించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ […]

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను తొక్కేశారా?
X
గోదావ‌రి మ‌హా పుష్క‌రాల ప్రారంభం రోజున జ‌రిగ‌న మ‌హా విషాదంపై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం నీడ క‌మ్మేస్తోంది. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఆ ఊసే మ‌రిచిపోయింది. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో వాస్త‌వాలు వెలుగు చూడ‌కుండా స‌ర్కారే తొక్కేస్తుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. జూలై 14 పుష్క‌రాల ప్రారంభం రోజున వీఐపీ ఘాట్‌లో స్నానం చేయాల్సిన సీఎం చంద్ర‌బాబు పుష్క‌ర ఘాట్ స్నానం చేసిన స‌మ‌యంలో రెండున్న‌ర గంట‌ల‌కు పైగా భ‌క్తుల‌ను నిలిపేసి ఓ డాక్యుమెంట‌రీ చిత్రీక‌రించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కార‌ణాల‌తో తొక్కిస‌లాట జ‌ర‌గి 27 మంది చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు..పుష్క‌రాలు ముగిసిన వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌త‌స్థాయి ద‌ర్యాప్తు బృందాన్ని వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే బాబు ప్ర‌క‌ట‌న చేసి మూడు వారాలు గ‌డిచిపోయింది. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ఊసేలేదు. ఈ ఘ‌ట‌న‌పై నిష్పాక్షిక ద‌ర్యాప్తు జ‌రిగితే.. అన్నివేళ్లూ దోషిగా చంద్ర‌బాబు వైపు చూపిస్తాయ‌నే అనుమానంతో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌ర‌గ‌కుండా తొక్కేస్తున్నార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ అనుమానాల‌కు ఊత‌మిచ్చేలా పుష్క‌ర ఘాట్‌ల వ‌ద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నుంచి తొక్కిస‌లాట దృశ్యాలు మాయ‌మ‌య్యాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. తొక్కిస‌లాట వెనుక నిజాలు బ‌య‌ట‌ప‌డకుండా ఉండేందుకు ద‌ర్యాప్తును తొక్కేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.
First Published:  3 Aug 2015 6:00 AM GMT
Next Story