లేటుగానైనా.. లేటెస్ట్ గా మెచ్చుకున్న రకుల్

బాహుబలి సినిమా విడుదలై ఇప్పటికే చాలా రోజులైంది. ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఫ్రెష్ గా ఈ జాబితాలోకి ఎంటరైంది రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న రకుల్, బాహుబలిని ఆకాశానికెత్తేసింది. ఎట్టకేలకు సినిమా చూశానని ట్విట్టర్ లో రాసుకొచ్చిన రకుల్.. సినిమాను హాలీవుడ్ మూవీస్ సరసన చేర్చేసింది. తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా బాహుబలి ఉందని మెచ్చుకుంది. ఇలాంటి తెలుగు సినీపరిశ్రమలో తను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చింది రకుల్. సినిమాలో నటించిన ప్రధాన తారాగణం అందరినీ పేరుపేరున పొగిడేసింది. తమన్న అయితే అద్భుతంగా నటించిందని, ప్రభాస్-రానా పర్ ఫార్మెన్స్ సూపర్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక రమ్యకృష్ణ మేడమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటూ పొగిడేసింది. ఫైనల్ గా బాహుబలి లాంటి విజువల్ వండర్ ను తెరకెక్కించిన రాజమౌళిని పొగడ్డానికి మాటలు రావడం లేదని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తమ్మీద ఇన్నాళ్లకు బాహుబలి సినిమా చూడ్డానికి ఈ అమ్మడుకు టైం దొరికిందన్నమాట.