బాహుబలికి బాద్ షా ప్రశంసలు

బాహుబలి సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. ఇన్నాళ్లూ తన కొత్త సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న షారూక్, 2 రోజుల కిందటే ఇండియాకొచ్చాడు. లండన్, అమెరికా, ఇటలీ దేశాల్లో తన కొత్త సినిమా దిల్ వాలే షూటింగ్ లో పాల్గొన్నాడు ఇన్నిరోజులు. ఇండియాకొచ్చిన ఈ 2 రోజుల్లోనే తన కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి సినిమా చూశాడు. అంతా మెచ్చుకుంటున్నట్టు బాహుబలిలో ఏముందో తెలుసుకోవాలనే సినిమాకు వచ్చానని చెప్పిన షారూక్, సినిమా చూసిన తర్వాత బాహుబలికి ఫిదా అయిపోయాడు. వెంటనే తన ట్విట్టర్ పేజ్ అందుకున్నాడు.. బాహుబలిని ప్రశంసల్లో ముంచెత్తాడు. సినిమా చూస్తున్నంతసేపు నటీనటుల హార్డ్ వర్క్ కనిపించిందని మెచ్చుకున్నాడు. ఆకాశాన్ని అందుకునే హక్కు, సత్తా మీకు మాత్రమే ఉందని ప్రత్యేకంగా బాహుబలి టీంను మెచ్చుకున్నాడు. షారూక్ ప్రశంసలతో బాహుబలి టీం పండగ చేసుకుంటోంది. దీనిపై రాజమౌళి ఇంకా రీ-ట్వీట్ చేయాల్సి ఉంది.