ఓటుకు నోటు కేసు 14కు వాయిదా

ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసుపై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. విచారణలో భాగంగా  తనను రాజకీయ నాయకుల పేర్లు చెప్పాల్సిందిగా బలవంతం చేస్తూ అవినీతి నిరోధక శాఖ వేధిస్తోందని ఉదయ్‌సింహ కోర్టుకు ఫిర్యాదు చేశారు. కాగా ఈనెల 14న మరోసారి విచారణకు హాజరుకావాలని రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను కోర్టు ఆదేశించింది. అయితే సెబాస్టియన్‌, ఉదయ్‌సింహలకు గతంలో విధించిన షరతులకు కోర్టు కొంత మినహాయింపు ఇచ్చింది. ఇక నుంచి ప్రతి రోజు హాజరు కావాల్సిన అవసరం లేదని, ప్రతి సోమవారం, గురువారం, శుక్రవారం హాజరయితే సరిపోతుందని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మరింత సమాచారం జోడించాల్సి ఉందని అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.