Telugu Global
National

ఇజ్రాయెల్‌ది యుద్ధ‌నేరమే!-ఆమ్నెస్టీ

గ‌తేడాది రఫా పట్టణంపై ఇజ్రాయిల్‌ కొనసాగించిన దాడులు యుద్ధ నేరాలేనని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది.  ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ విడుద‌ల చేసిన‌ ‘బ్లాక్‌ ఫ్రైడే.. కార్నేజ్‌ ఇన్‌ రఫా` అనే నివేదిక‌లో ఇజ్రాయెల్ యుద్ధ‌నేరాల‌ను వివ‌రించింది. యుద్ధ‌నేరంగా ప‌రిగ‌ణించే ఈ దాడుల‌కు పాల్ప‌డిన ఇజ్రాయిల్‌ను అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి)లో ప్రాసిక్యూట్ చేయొచ్చ‌ని ఈ నివేదిక‌లో వెల్ల‌డించింది. 50రోజుల పాటు ఇజ్రాయెల్ కొన‌సాగించిన ఈ మార‌ణ‌కాండ‌లో 2,251 మంది పాలస్తీనియన్లు మరణించార‌ని, ఇందులో […]

ఇజ్రాయెల్‌ది యుద్ధ‌నేరమే!-ఆమ్నెస్టీ
X
గ‌తేడాది రఫా పట్టణంపై ఇజ్రాయిల్‌ కొనసాగించిన దాడులు యుద్ధ నేరాలేనని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది. ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ విడుద‌ల చేసిన‌ ‘బ్లాక్‌ ఫ్రైడే.. కార్నేజ్‌ ఇన్‌ రఫా' అనే నివేదిక‌లో ఇజ్రాయెల్ యుద్ధ‌నేరాల‌ను వివ‌రించింది. యుద్ధ‌నేరంగా ప‌రిగ‌ణించే ఈ దాడుల‌కు పాల్ప‌డిన ఇజ్రాయిల్‌ను అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి)లో ప్రాసిక్యూట్ చేయొచ్చ‌ని ఈ నివేదిక‌లో వెల్ల‌డించింది. 50రోజుల పాటు ఇజ్రాయెల్ కొన‌సాగించిన ఈ మార‌ణ‌కాండ‌లో 2,251 మంది పాలస్తీనియన్లు మరణించార‌ని, ఇందులో 551 మంది చిన్నారులతో సహా 1,452 మంది పౌరులున్నారు. దాదాపు 11,200 మందికి పైగా పాలస్తీనియన్లు గాయాల పాలయ్యారని ఆమ్నెస్టీ వివరించింది. కాగా పాలస్తీనా దళాలు చేసిన ఎదురు దాడుల్లో కేవలం ఇజ్రాయిల్‌కు చెందిన 67మంది సైనికులు మాత్రమే మరణించారని ఆమ్నెస్టీ తెలిపింది. ఈ యుద్ధంలో దాదాపు 5లక్షల మందికి పైగా నిర్వా సితులు కాగా అందులో లక్షమంది ఇప్పటికీ శాశ్వతమైన గూడు లేక అల్లాడుతున్నారని వివరించింది.
First Published:  4 Aug 2015 3:42 AM GMT
Next Story