Telugu Global
National

కాంగ్రెస్‌కు దన్నుగా మరో 8 పార్టీలు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో నిరసించాయి. ఉదయం లోక్‌సభ ఆవరణలో నిరసన తెలిపిన కాంగ్రెస్‌ సభ్యులు సాయంత్రం తమ నిరసనను బీజేపీ కార్యాలయానికి మార్చారు. ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు వద్ద కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఒక్క ఉదుటున ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు ధర్నాలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు సమాజ్‌వాది, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా బీజేపీ […]

కాంగ్రెస్‌కు దన్నుగా మరో 8 పార్టీలు
X
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో నిరసించాయి. ఉదయం లోక్‌సభ ఆవరణలో నిరసన తెలిపిన కాంగ్రెస్‌ సభ్యులు సాయంత్రం తమ నిరసనను బీజేపీ కార్యాలయానికి మార్చారు. ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు వద్ద కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఒక్క ఉదుటున ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు ధర్నాలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు సమాజ్‌వాది, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా బీజేపీ చర్యను తప్పుబట్టాయి. సస్పెన్షన్‌ అనేది ఏదో ఒక పార్టీకి చెందిన వ్యవహారం కాదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చెందిన విషయమని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది. టీఎంసీ ఎంపీ సుదీప్‌ గంగోపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ 25 మంది ఎంపీలను ఒకేసారి సస్పెండ్‌ చేయడం సరికాదన్నది తమ పార్టీ అదినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయమని తెలిపారు. ఎంపీల సస్పెన్స్‌కు నిరసనగా టీఎంసీ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరుకాబోమని, రిజిష్టర్‌లో సంతకాలు చేయమని, వేతనాలు తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌కు మద్దతుగా మరో 8 పార్టీలు కూడా సభ నుంచి బాయ్‌కాట్‌ చేశాయి. కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఎన్‌సీపీ, జేడియూ పార్టీలు కూడా ప్రకటించాయి. ఎన్‌సీపీ నేత తారీఖ్‌ అన్వర్‌ మాట్లాడుతూ తమ పార్టీ కాంగ్రెస్‌కు బాసటగా నిలుస్తుందని, పార్లమెంట్‌లోని సభ్యులకు తమ మాటలను చెప్పే అవకాశం కల్పించడమే సంప్రదాయంగా వస్తోందని అన్నారు.
సభలో లేనివారిపైనా సస్పెన్షన్‌ వేటు: ఖర్గే
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించిన జాబితాలో సభకు హాజరుకాని ముగ్గురు ఎంపీల పేర్లు కూడా ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖార్టే అన్నారు. దాన్ని బట్టే ఆ చర్య వెనుక అధికారపక్షం కుట్ర ఉందని లోక్‌సభలో ఆయన ఆరోపించారు. అవినీతి నేతలు రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగబోదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌పై ఒత్తిడి తీసుకురావడంతో సభాపతి ఆ జాబితాలో లేని పేర్లను కూడా చదివారని ఆయన విమర్శించారు. అధికారపక్షానికి పార్లమెంట్‌ సజావుగా నడపాలన్న ఉద్దేశమే ఉంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలతో రాజీనామాలు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
First Published:  4 Aug 2015 5:47 AM GMT
Next Story