Telugu Global
Others

పంట‌లు త‌గ‌ల‌బెట్టించింది చంద్ర‌బాబే!

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు తీవ్ర విమ‌ర్శ‌ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం సింగ‌పూర్ బృందంతో మాస్ట‌ర్‌ప్లాన్ త‌యారు చేయించిన చంద్ర‌బాబు రైతుల భూములు లాక్కోవ‌డానికి అంత‌కంటే పెద్ద మాస్ట‌ర్‌ప్లాన్ అమ‌లు చేశార‌ట‌. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ఈ సంచ‌ల‌న విమ‌ర్శ చేశారు. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లో అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రైతు స‌ద‌స్సులో మ‌ధు ముఖ్య‌ప్ర‌సంగం చేశారు. రాజ‌ధాని ప్రాంత రైతులు భూములు ఇవ్వ‌డానికి సిద్ధంగా లేక‌పోతే వారి భ‌య‌పెట్ట‌డం కోసం చంద్ర‌బాబు […]

పంట‌లు త‌గ‌ల‌బెట్టించింది చంద్ర‌బాబే!
X
సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు తీవ్ర విమ‌ర్శ‌
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం సింగ‌పూర్ బృందంతో మాస్ట‌ర్‌ప్లాన్ త‌యారు చేయించిన చంద్ర‌బాబు రైతుల భూములు లాక్కోవ‌డానికి అంత‌కంటే పెద్ద మాస్ట‌ర్‌ప్లాన్ అమ‌లు చేశార‌ట‌. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ఈ సంచ‌ల‌న విమ‌ర్శ చేశారు. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లో అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రైతు స‌ద‌స్సులో మ‌ధు ముఖ్య‌ప్ర‌సంగం చేశారు. రాజ‌ధాని ప్రాంత రైతులు భూములు ఇవ్వ‌డానికి సిద్ధంగా లేక‌పోతే వారి భ‌య‌పెట్ట‌డం కోసం చంద్ర‌బాబు నాయుడు అనేక దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాజ‌ధాని భూముల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా లాక్కుంద‌ని మ‌ధు అన్నారు. త‌మ‌ పొలాలు త‌మ‌కు ఇవ్వ‌మ‌ని రైతులు అడిగితే రాత్రికి రాత్రి పైపులు పెక‌లించి, క‌రెంటు తీగ‌లు తీసేసి, గుడిసెలు తొల‌గించి ఏడు గ్రామాల‌లోని పంట‌ల‌ను త‌గుల‌బెట్టార‌ని మ‌ధు వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్ట‌లేద‌ని, రైతుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే ఆ పొలాల‌లోని పంట‌ల‌ను త‌గుల‌బెట్టించార‌ని మ‌ధు విమ‌ర్శించారు. చంద్ర‌బాబు ఏ క్ష‌ణాన సీఎం అయ్యారో… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌లోనూ చిచ్చు పెడుతున్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రుణ‌భారంతో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగాయి. అని మ‌ధు పేర్కొన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ఆయ‌క‌ట్టుకు వెంట‌నే నీరివ్వాల‌ని, లేదంటే 2016 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే స‌మావేశాల‌లో అసెంబ్లీని ముట్ట‌డిస్తామ‌ని మ‌ధు హెచ్చ‌రించారు. సాగునీటి కోసం ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌న్నారు. శ్రీ‌కాకుళం ప‌వ‌ర్‌ప్లాంటుకు వెయ్యి ఎక‌రాలు అవ‌స‌ర‌మైతే ఐదువేల ఎక‌రాలు రైతుల నుంచి లాక్కున్నార‌ని మ‌ధు విమ‌ర్శించారు. మెజార్టీ లేక‌పోయినా దొడ్డిదారిన జెడ్పీలు, మునిసిపాలిటీల‌ను తెలుగుదేశం పార్టీ కైవ‌సం చేసుకుని దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.
First Published:  3 Aug 2015 11:50 PM GMT
Next Story