Telugu Global
Cinema & Entertainment

నాగ్ ,కార్తీల సినిమాకు ఆ హాలీవుడ్ సినిమా ప్రేరణా..?

ఎత్తుడు ..దింపుడు  మ‌న‌కు కొత్త కాదు. అదేలేండి  ప్రేర‌ణ పేరు తో    హాలీవుడ్ చిత్రాల్ని   కాపి కొట్ట‌డం అనేది  మన టాలీవుడ్ కు కొత్త కాదు. అఫ్ కోర్స్ టాలీవుడ్ అనే కాదు..  ఎక్క‌డైనా ఈ ప‌రిస్థితి ఉంది.   తాజాగా వంశీ పైడి ప‌ల్లి  దర్శకత్వంలో నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్న  లీడ్ రోల్స్ లో చేస్తున్న  బై లింగ్విల్ ఫిల్మ్.. హాలీవుడ్ `ఇన్ ట‌చ్ బుల్స్` నుంచి దింపుతున్నార‌నే టాక్ వినిపిస్తుంది.  2012 […]

నాగ్ ,కార్తీల సినిమాకు ఆ హాలీవుడ్ సినిమా ప్రేరణా..?
X
ఎత్తుడు ..దింపుడు మ‌న‌కు కొత్త కాదు. అదేలేండి ప్రేర‌ణ పేరు తో హాలీవుడ్ చిత్రాల్ని కాపి కొట్ట‌డం అనేది మన టాలీవుడ్ కు కొత్త కాదు. అఫ్ కోర్స్ టాలీవుడ్ అనే కాదు.. ఎక్క‌డైనా ఈ ప‌రిస్థితి ఉంది. తాజాగా వంశీ పైడి ప‌ల్లి దర్శకత్వంలో నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్న లీడ్ రోల్స్ లో చేస్తున్న బై లింగ్విల్ ఫిల్మ్.. హాలీవుడ్ 'ఇన్ ట‌చ్ బుల్స్' నుంచి దింపుతున్నార‌నే టాక్ వినిపిస్తుంది. 2012 లో వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఒలివ‌ర్ నాచ్, ఎరిచ్ అనే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం విశేషం. క్వాడ‌ర్ ప్లిగియ అనే వ్యాధిగ్ర‌స్తుడైన బిలియనీర్ చుట్టు క‌థ తిరుగుతుంది. ఆయ‌న‌కు ఒక యంగ్ క‌పుల్ కేర్ టేక‌ర్స్ గా వుంటారు. వీరి ముగ్గురి మధ్య జ‌రిగే స్టోరినే 'ఇన్ ట‌చ్ బుల్స్' చిత్రం స్టోరి.
డైరెక్ట‌ర్ వంశీ ఆ సినిమానే కాస్తా మార్చి.. ఈ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేస్తున్న‌ట్టు రూమ‌ర్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ రూమ‌ర్స్ ప‌ట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. మాట‌లు రాని , వీల్ చైర‌కే ప‌రిమిత‌మైన బిలియ‌నీర్ రోల్ లో నాగార్జున చేస్తుండ‌గా.. ఆయ‌న కేర్ టేక‌ర్స్ గా కార్తీ, త‌మ‌న్నా లు చేస్తున్నారనేది ఇంట‌ర్న‌ల్ గా టాక్. అంటే ఆసినిమాను ఇతి వృత్తాని మ‌క్కీ కి మ‌క్కి దింపుతున్నార‌న్న‌మాట‌. ఏదైతే లేండి.. బొమ్మ ఆడియ‌న్స్ ను మెప్పించిందా లేదా అనేది మ‌న‌కు ముఖ్యం క‌దా..! వాళ్ల క‌ష్టాలేవో వాళ్లు ప‌డ‌తారు పాపం.!
First Published:  4 Aug 2015 12:30 AM GMT
Next Story