Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 164

కలర్స్‌ సిగ్నల్‌ ఒక పోలీసాఫీసర్‌ భార్య కారు ట్రాఫిక్‌లో ఆగింది. కాసేపటికి అన్ని కార్లు కదిలాయి. ఆమె కారు కదలలేదు. రెడ్‌ లైట్‌ పోయింది. ఎల్లో లైట్‌ వచ్చింది. తర్వాత గ్రీన్‌లైట్‌, మళ్లీ ఎల్లో లైట్‌ మళ్లీ రెడ్‌ లైట్‌. అయినా కారు ముందుకు కదలలేదు. పోలీసు పరిగెట్టుకుంటూ వచ్చి “మేడం! మీకు మా లైట్ల రంగులేవీ నచ్చినట్లు లేదు” అన్నాడు. —————————————————————– మాలో ఒకడిగా… పిచ్చాసుపత్రిలో పేషెంట్‌ కొత్తగా వచ్చిన డాక్టర్‌తో…. “వెనకటి డాక్టర్‌ కన్నా […]

కలర్స్‌ సిగ్నల్‌
ఒక పోలీసాఫీసర్‌ భార్య కారు ట్రాఫిక్‌లో ఆగింది. కాసేపటికి అన్ని కార్లు కదిలాయి.
ఆమె కారు కదలలేదు. రెడ్‌ లైట్‌ పోయింది. ఎల్లో లైట్‌ వచ్చింది. తర్వాత గ్రీన్‌లైట్‌, మళ్లీ ఎల్లో లైట్‌ మళ్లీ రెడ్‌ లైట్‌.
అయినా కారు ముందుకు కదలలేదు. పోలీసు పరిగెట్టుకుంటూ వచ్చి “మేడం! మీకు మా లైట్ల రంగులేవీ నచ్చినట్లు లేదు” అన్నాడు.
—————————————————————–
మాలో ఒకడిగా…
పిచ్చాసుపత్రిలో పేషెంట్‌ కొత్తగా వచ్చిన డాక్టర్‌తో….
“వెనకటి డాక్టర్‌ కన్నా నిన్ను బాగా ఇష్టపడుతున్నాం” అన్నాడు.
దానికి ఆ డాక్టర్‌ “ఎందుకలా అనుకుంటున్నారు?” అన్నాడు.
“ఎందుకంటే నిన్ను మాలో ఒకడిగా చూస్తున్నాం” అనే సరికి షాక్‌ తిన్నాడు కొత్త డాక్టర్‌.
—————————————————————–
లేటు
శ్రీమతి కళ: మా ఆయన ప్రతిరోజూ పొద్దున్నే నన్ను కొడతారు.
శ్రీమతి పరిమళ: అయ్యో పాపం! ఎందుకని.
శ్రీమతి కళ: మా ఆయన పొద్దున్నే ఏడు గంటలకు నిద్రలేస్తారు. నేను ఎనిమిది గంటలకు లేస్తాను. నన్ను గంటసేపు కొట్టిలేపుతారు.
—————————————————————–
రాష్‌ డ్రైవింగ్‌
ఆ దంపతులు కొత్తగా ఒక డ్రైవర్‌ని పెట్టుకున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో భార్య కారులో షాపింగ్‌కి వెళ్లింది. అట్లా మూడు రోజులు షాపింగ్‌కు వెళ్లింది. నాలుగో రోజు భర్తతో….
“ఈ డ్రైవర్‌ చాలా రాష్‌గా డ్రైవింగ్‌ చేస్తాడు. నేను మూడుసార్లు యాక్సిడెంట్‌ అవుతుందని భయపడ్డాను” అంది.
దానికి ఆమె భర్త “ఇంకోసారి అవకాశమిచ్చి చూడు డార్లింగ్‌” అన్నాడు.

First Published:  3 Aug 2015 1:03 PM GMT
Next Story