Telugu Global
National

మా విద్యార్ధులే కిడ్నాప్ చేశారు: లక్ష్మీకాంత్, రామకృష్ణ

ట్రిపోలిలో తమను కిడ్నాప్‌ చేసిన వారు యూనివర్సిటీలో తమ వద్ద చదువుకుని, ఆ తర్వాత ఉగ్రవాదులుగా మారిన విద్యార్ధులేనని కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన కర్ణాటక ప్రొఫెసర్లు లక్ష్మీకాంత్‌, రామకృష్ణ తెలిపారు. కిడ్నాపర్లు 13 నుంచి 17 సంవత్సరాల వయసువారేనని, తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ఉగ్రవాదులు చెరలో బందీలుగా ఉన్న తెలుగు వారి గురించి ఆందోళన చెందవద్దని, వారిని బాగా చూసుకుంటామని ఐసిస్ ఉగ్రవాదులు తమకు హామీ ఇచ్చారని వీరు తెలిపారు. ప్రొఫెసర్లమయిన తమను కిడ్నాప్ […]

ట్రిపోలిలో తమను కిడ్నాప్‌ చేసిన వారు యూనివర్సిటీలో తమ వద్ద చదువుకుని, ఆ తర్వాత ఉగ్రవాదులుగా మారిన విద్యార్ధులేనని కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన కర్ణాటక ప్రొఫెసర్లు లక్ష్మీకాంత్‌, రామకృష్ణ తెలిపారు. కిడ్నాపర్లు 13 నుంచి 17 సంవత్సరాల వయసువారేనని, తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ఉగ్రవాదులు చెరలో బందీలుగా ఉన్న తెలుగు వారి గురించి ఆందోళన చెందవద్దని, వారిని బాగా చూసుకుంటామని ఐసిస్ ఉగ్రవాదులు తమకు హామీ ఇచ్చారని వీరు తెలిపారు. ప్రొఫెసర్లమయిన తమను కిడ్నాప్ చేయడం తప్పని ఐసిస్ ఉగ్రవాదులు అంగీకరించారని తెలిపారు. తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలతోపాటు కిడ్నాప్‌కు గురైన వీరిద్దరూ మంగళవారం హైదరాబాద్‌ మీదుగా బెంగుళూరు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తనతోపాటు అపహరణకు గురైన తెలంగాణ, ఆంధ్రా ప్రొఫెసర్లు క్షేమంగానే ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రొఫెసర్లను కూడా వారు త్వరలోనే వదిలి వేస్తారని భావిస్తున్నామని వీరు తెలిపారు.

First Published:  4 Aug 2015 10:58 AM GMT
Next Story