Telugu Global
Cinema & Entertainment

అనుష్క మొబైల్ కొట్టేసిన మహేష్

మహేష్ బాబుకు అనుష్క మొబైల్ కొట్టేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం వేరు. ఇప్పటికే పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్.. ఇన్నాళ్లూ అనుష్క బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఓ మొబైల్ కంపెనీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటెక్స్ కంపెనీకి మొన్నటివరకు అనుష్క ప్రచారం చేసిపెట్టింది. చేతిలో మొబైల్ పట్టుకొని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించాయి. పబ్ లో షూట్ చేసిన ఓ యాడ్ లో కూడా […]

అనుష్క మొబైల్ కొట్టేసిన మహేష్
X
మహేష్ బాబుకు అనుష్క మొబైల్ కొట్టేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం వేరు. ఇప్పటికే పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్.. ఇన్నాళ్లూ అనుష్క బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఓ మొబైల్ కంపెనీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటెక్స్ కంపెనీకి మొన్నటివరకు అనుష్క ప్రచారం చేసిపెట్టింది. చేతిలో మొబైల్ పట్టుకొని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించాయి. పబ్ లో షూట్ చేసిన ఓ యాడ్ లో కూడా కనిపించింది. కానీ ఇకపై ఆమె స్థానంలో మహేష్ కనిపిస్తాడు. బొమ్మాలితో కాంట్రాక్ట్ పూర్తవ్వడంతో మహేష్ ను తీసుకున్నారు ఇంటెక్స్ అధినేతలు. ఇప్పటికే మహేష్ తో అన్నపూర్ణ స్టుడియోలో యాడ్ షూటింగ్ కూడా పూర్తిచేశారు. నిన్న జరిగిన ఓ ఈవెంట్ లో మహేష్ తో తమ కొత్త సెల్ ఉత్పత్తుల్ని కూడా లాంఛ్ చేశారు. అలా అనుష్క నుంచి ఆ బ్రాండ్ మహేష్ చేతిలోకి వచ్చింది. మహేష్ రాకతో తమ మొబైల్స్ అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తోంది ఇంటెక్స్.
First Published:  3 Aug 2015 7:01 PM GMT
Next Story