బజరంగీ రీమేక్ లో పవన్ కల్యాణ్

  హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా బంపర్ హిట్టయింది. ఇప్పటికే 5వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ హిట్ సినిమాపై ఇప్పుడు తెలుగు నిర్మాతల కన్నుపడింది. కుదిరితే ఈ సినిమాను పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా మొదలయ్యాయి. తెలుగులో దిల్ రాజు, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ కూడా రీమేక్ లో నటించేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. గతంలో సల్మాన్ నటించిన దబంగ్ సినిమాను గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు పవన్. తాజాగా బజరంగీ భాయిజాన్ సినిమాను కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ కు కూడా హరీష్ శంకరే దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం నడుస్తున్న సర్దార్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బజరంగీ భాయిజాన్ తెలుగు రీమేక్ పట్టాలపైకి వస్తుంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన విషయం మనందరికీ తెలిసిందే.