Telugu Global
National

పలు రైళ్లు నిలిపివేత... సహాయచర్యలు ముమ్మరం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. రైల్వే అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. వైద్య, సహాయక బృందాలతో సంఘటన స్థలానికి ప్రత్యేకరైలును పంపించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలో దించారు. ముంబయి, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. ఇందులో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరే రైళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని రైళ్లను రాజస్థాన్‌-కోట మీదుగా మళ్లించారు. హర్దా వద్ద మూడు […]

పలు రైళ్లు నిలిపివేత... సహాయచర్యలు ముమ్మరం
X

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. రైల్వే అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. వైద్య, సహాయక బృందాలతో సంఘటన స్థలానికి ప్రత్యేకరైలును పంపించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలో దించారు. ముంబయి, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. ఇందులో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరే రైళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని రైళ్లను రాజస్థాన్‌-కోట మీదుగా మళ్లించారు. హర్దా వద్ద మూడు రైళ్లను రద్దు చేశారు. 25 రైళ్లను దారిమళ్లించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఎంత మంది మరణించారనేది ఇంకా తేలలేదు. మృతులు 30 మంది పైగానే ఉంటారని భావిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీల్లోకి వరద నీరు చేరిందని రైల్వే అధికారులు చెప్పారు. సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది.
మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 30 మంది ప్రయాణికులు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ వ్యాఖ్యానించారు. కాగా మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి సురేష్‌ప్రభు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రహోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

First Published:  4 Aug 2015 10:46 PM GMT
Next Story