Telugu Global
Cinema & Entertainment

అబ్బాయినైతే దీపికకు ప్రపోజ్ చేసేదాన్ని...

ఓం శాంతి ఓం సినిమాకు ముందు దీపిక ఒక సాధార‌ణ   హీరోయిన్ . త‌న మాతృభాష  క‌న్న‌డంలో చిన్న‌ చిన్న చిత్రాలు చేస్తూ ఉండేది.   షారుక్ ఖాన్ హీరోగా.. లేడి డైరెక్ట‌ర్ ఫ‌రా ఖాన్.. షారుక్ స‌ర‌స‌న హీరోయిన్ గా  దీపిక ను బాలీవుడ్ కు ప‌రిచయం  చేసింది. అంతే మొద‌టి సినిమాతోనే   తనకు నటనా చాతుర్యత‌ ఎంతగా వుందో చూపించింది.    బాలీవుడ్ లో ఎంట్రీనే షారుక్ తో నటించే అవకాశం […]

అబ్బాయినైతే దీపికకు ప్రపోజ్ చేసేదాన్ని...
X
ఓం శాంతి ఓం సినిమాకు ముందు దీపిక ఒక సాధార‌ణ హీరోయిన్ . త‌న మాతృభాష క‌న్న‌డంలో చిన్న‌ చిన్న చిత్రాలు చేస్తూ ఉండేది. షారుక్ ఖాన్ హీరోగా.. లేడి డైరెక్ట‌ర్ ఫ‌రా ఖాన్.. షారుక్ స‌ర‌స‌న హీరోయిన్ గా దీపిక ను బాలీవుడ్ కు ప‌రిచయం చేసింది. అంతే మొద‌టి సినిమాతోనే తనకు నటనా చాతుర్యత‌ ఎంతగా వుందో చూపించింది. బాలీవుడ్ లో ఎంట్రీనే షారుక్ తో నటించే అవకాశం దొరకడం.. దీపిక అందానికి బి టౌన్ ఫిల్మ్ మేక‌ర్స్ తో పాటు.. స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు. దీపికను హీరోయిన్ గా తీసుకోవ‌డానికి చాల మంది హీరోలు పోటి ప‌డుత‌న్నార‌న్న‌ది నిజం. త‌ను వ్య‌క్తిగ‌తంగా ఎన్ని ల‌వ్ ఎఫైర్స్ ఫేస్ చేసిన‌..అవేవి కెరీర్ మీద ఎఫెక్ట్ ప‌డ‌నివ్వ‌కుండా.. స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.
ఇక దీపిక అందానికి ర‌ణ‌బీర్ క‌పూర్, వంటి కాస‌నోవ ల తో పాటు.. మ‌న బాహుబ‌లి ప్ర‌భాస్ కూడా ఫిదా అయ్యాడు. బి టౌన్ లో త‌ను సినిమా చేయాల్సి వ‌స్తే ..దీపిక ప‌దుకోణ్ తో చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌తాన‌ని ఈ మధ్యే చెప్పిన విష‌యం తెలిసిందే. స‌రే జెంట్స్ దీపిక అందానికి ఫిదా కావ‌డం అనేది నాచుర‌ల్ 'లా'. క‌ట్ చేస్తే.. అమ్మాయిలు ఎట్రాక్ట్ కావ‌డం అనేది నిజంగా పెద్ద ఇష్యూనే . అవనీ మోడి అనే ఒక కొత్త‌మ్మాయి మ‌ధూర్ బండార్క‌ర్ 'క్యాలెండ‌ర్ గ‌ర్ల్స్' చిత్రం ద్వారా ప‌రిచ‌యం అవుతుంది. ఈ ముద్దుగుమ్మ ను ఒక జాతీయ ప‌త్రిక టెలిఫోన్ ఇంట‌ర్వూ చేసింది. స‌మ‌కాలిన న‌టీ మ‌ణుల్లో ఎవ‌రంటే ఇష్ట‌మ‌ని అడిగిన ప్ర‌శ్నకు.. త‌న‌కు దీపిక ప‌దుకోణ్ అంటే చాల ఇష్ట‌మ‌ని..త‌న స్టైల్.. త‌న బ్యూటీ.. యిన్ ఎవ్రీథింగ్ ఐ లైక్ దీపిక అంటూ చెప్పింది. అంతే కాదు..తను గ‌న‌క అబ్బాయిగా పుట్టి వుంటే..క‌చ్చితంగా దీపిక ప‌దుకోణ్ కు ప్ర‌పోజ్ చేసే దానిన‌ని తెలిపింది. మ‌రి దీపిక ప‌దుకోణ్ ఫాలోయింగ్ కు ఇంతకంటే మంచి ఉద‌హార‌ణ ఏం చెబుతాం..! ద టీజ్ దీప్స్…! మ్మెస్మ‌రైజింగ్ ఎంజిల్ ..!
First Published:  4 Aug 2015 7:00 PM GMT
Next Story