చార్మీ నీకిది తగునా..? 

సొంత సినిమా   గురించి  ప్ర‌మోట్ చేయ‌డానికి బ‌బ్లీ గాళ్ చార్మీకి  ఎంతో ఎన‌ర్జీ వ‌చ్చింది.  న‌టిగా  ఫేడ్ అవ్వ‌కుండ వుండాల‌నే త‌ప‌న‌తో పూరీ  జ‌గ‌న్నాధ్ ను ఒప్పించి త‌నే నిర్మాత‌గా మారి.. జ్యోత‌లక్ష్మి చిత్రం చేసింది.  త‌ను ఒక పెట్టుబ‌డి దారుగా ఉంది కాబ‌ట్టి.. సినిమా కోసం.. ప్ర‌చారం ఒక రేంజ్ లో చేసింది.  విడుద‌ల‌కు ముందు.. రిలీజ్ అయిన త‌రువాత‌..  మ్యాగ్జిమ‌మ్  ప‌బ్లిసిటి  జ్యోతిల‌క్ష్మీ చిత్రం కోసం చేసింది. 
క‌ట్ చేస్తే  మొన్న విడుద‌లైన  మంత్ర‌2 చిత్రం ఒక మాదిరి టాక్ గెయిన్ చేసింది. ఈ చిత్రంలో త‌ను కేవ‌లం న‌టించింది.  ఏ విధ‌మైన పెట్టుబ‌డి పెట్ట‌లేదు. ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ కు త‌ప్ప‌..    సినిమా రిలీజ్ కు ముందుగానీ.. విడుద‌ల త‌రువాత గానీ ప్ర‌చారానికి రాకుండ మొహం చాటేస్తుంద‌ట‌.త‌ను నిర్మాత గా వుంటే మాత్రం  గ్యాప్ లేకుండా ప్ర‌చారం చేయ‌డం..త‌ను  కేవ‌లం న‌టించిన చిత్రానికి మినిమ‌మ్ స‌పోర్ట్  చేయ‌క పోవ‌డం అనేది  చార్మిలో  డబుల్ స్టాండర్డ్స్ కు  నిద‌ర్శ‌నం అంటున్నారు క్రిటిక్స్.