Telugu Global
Others

ఆధారాలు చూపిస్తే రాజీనామా: సుష్మా

లలిత్‌గేట్‌పై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తొలిసారిగా లోక్‌సభలో పెదవి విప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రతిపక్షాలు యాగీ చేయకుండా తన వాదన వినాలని ఆమె చెప్పుకొచ్చారు.  తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే చూపించమని సవాలు చేస్తూ… అలాంటివి ఏమైనా ఉన్నట్టు రుజువైతే రాజీనామాకు కూడా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. రెండు నెలలుగా తనపై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, తనపై వచ్చిన ఆరోపణలకు సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నాని ఆమె […]

ఆధారాలు చూపిస్తే రాజీనామా: సుష్మా
X
లలిత్‌గేట్‌పై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తొలిసారిగా లోక్‌సభలో పెదవి విప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రతిపక్షాలు యాగీ చేయకుండా తన వాదన వినాలని ఆమె చెప్పుకొచ్చారు. తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే చూపించమని సవాలు చేస్తూ… అలాంటివి ఏమైనా ఉన్నట్టు రుజువైతే రాజీనామాకు కూడా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. రెండు నెలలుగా తనపై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, తనపై వచ్చిన ఆరోపణలకు సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నాని ఆమె అన్నారు. తనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని, లలిత్ మోడీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదని, సిఫార్సు చేసినట్లు లేఖ, ఈ-మెయిల్ సందేశం వంటివి ఏమి ఉన్నా చూపించమని ఆమె సవాలు విసిరారు. మీడియా చేసే దుష్ర్పచారం ఆధారంగా విపక్షాలు మాట్లాడడం సమంజసం కాదని ఆమె అన్నారు. లలిత్‌మోడీకి నేను ఆర్థికంగా లాభం చేకూర్చానా, లలిత్‌మోడీ దేశం విడిచి పారిపోయేందుకు సహకరించానా అని సుష్మా ప్రశ్నించారు. లలిత్‌మోడీకి సంబంధించి నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వానికే వదిలేశానని ఆమె చెప్పారు. ‘లలిత్ మోడీ భార్య 10 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పోర్చుగల్‌లో లలిత్‌మోడీ భార్యకు చికిత్స జరుగుతోంది. ఈసారి ఆమె పరిస్థితి తీవ్రంగా మారింది. ఆరోగ్య విషయంలో భర్తతో కలిసి రావాలని వైద్యులు కోరారు. మానవతా దృక్పథంలో మహిళకు సాయం చేయటం నేరమా’ అని ప్రశ్నించారు. తనపై గత రెండు నెలలుగా మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, విపక్షాలు దాన్నే ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాయని మంత్రి సుష్మా ఆరోపించారు.
First Published:  6 Aug 2015 5:50 AM GMT
Next Story