Telugu Global
Others

లిబియాలో జడ్జిని చంపిన ఐసిస్

లిబియాలో ఓ జడ్జిని ఇస్లామిక్ తీవ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. వారం రోజుల నుంచి బందీగా ఉంచుకున్న జడ్జిని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చంపివేశారని లిబియన్ జుడీషియల్ ఆర్గనేజేషన్ తెలిపింది. హొహ్మద్ అల్ నమ్లి అనే ఈ జడ్జి మృతదేహం అల్ హవారా పట్టణం సమీపంలో కనుగొన్నట్లు సదరు ఆర్గనేజేషన్ తెల్పింది. అతని దేహంపై హింసించినట్లుగా గాయాలున్నాయి. గతవారం సిర్టే పట్టణంలో అల్ నమ్లిని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. దీంతో ట్రిపొలీలోనే ఉగ్రవాదుల చెరలో […]

లిబియాలో ఓ జడ్జిని ఇస్లామిక్ తీవ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. వారం రోజుల నుంచి బందీగా ఉంచుకున్న జడ్జిని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చంపివేశారని లిబియన్ జుడీషియల్ ఆర్గనేజేషన్ తెలిపింది. హొహ్మద్ అల్ నమ్లి అనే ఈ జడ్జి మృతదేహం అల్ హవారా పట్టణం సమీపంలో కనుగొన్నట్లు సదరు ఆర్గనేజేషన్ తెల్పింది. అతని దేహంపై హింసించినట్లుగా గాయాలున్నాయి. గతవారం సిర్టే పట్టణంలో అల్ నమ్లిని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. దీంతో ట్రిపొలీలోనే ఉగ్రవాదుల చెరలో తెలుగు ప్రొఫెసర్లు ఉండడంతో బాధిత కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
First Published:  5 Aug 2015 1:16 PM GMT
Next Story