Telugu Global
Cinema & Entertainment

చిరు సినిమా పేరుతో చెర్రి కొత్త‌ సినిమా... ?

శ్రీనువైట్ల దర్శకత్వంలో ఏకథాటిగా పనిపూర్తిచేస్తున్నాడు రామ్ చరణ్. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చింది. సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్సు పిక్చరైజ్ చేయడమే కాదు.. సినిమా షూటింగ్ కూడా క్లైమాక్స్ కు వచ్చింది. ప్రస్తుతం థాయ్ లాండ్ బీచుల్లో ఈ సినిమా క్లయిమాక్స్ కు సంబంధించిన సీన్లు తీస్తున్నారు. బ్రహ్మానందం, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను […]

చిరు సినిమా పేరుతో చెర్రి కొత్త‌ సినిమా... ?
X
శ్రీనువైట్ల దర్శకత్వంలో ఏకథాటిగా పనిపూర్తిచేస్తున్నాడు రామ్ చరణ్. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చింది. సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్సు పిక్చరైజ్ చేయడమే కాదు.. సినిమా షూటింగ్ కూడా క్లైమాక్స్ కు వచ్చింది. ప్రస్తుతం థాయ్ లాండ్ బీచుల్లో ఈ సినిమా క్లయిమాక్స్ కు సంబంధించిన సీన్లు తీస్తున్నారు. బ్రహ్మానందం, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే సినిమాకు టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. చిరంజీవి నటించిన పాత సినిమాల్లో ఒక టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో శ్రీనువైట్ల ఉన్నాడు. అటు చెర్రీ మాత్రం ఫ్రెష్ గా మరో పేరు ఆలోచించమని సలహా ఇస్తున్నాడట. ఏదేమైనా చెర్రీ కొత్త సినిమా టైటిల్ పై ఈనెల్లోనే క్లారిటీ రానుందనేది గుడ్ న్యూస్.
First Published:  5 Aug 2015 7:01 PM GMT
Next Story