Telugu Global
Others

అణ్వ‌స్త్రాలు లేకుండానే అభివృద్ధి: జ‌పాన్ ప్ర‌ధాని 

హిరోషిమా న‌గ‌రంపై అణుబాంబు దాడి జ‌రిగి గురువారానికి 70 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా హిరోషిమాలోని మెమోరియ‌ల్ పీస్ పార్క్‌లో జ‌రిగిన సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే పాల్గొన్నారు. బాంబుదాడిలో మృతి చెందిన వారికి నివాళి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అణ్వ‌స్త్ర ర‌హితంగానే జ‌పాన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. భ‌యంక‌ర‌మైన దాడి నుంచి హిరోషిమా కోలుకొని ప్ర‌పంచంలోనే అభివృద్ది చెందిన న‌గ‌రంగా నిలిచింద‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌పంచ‌దేశాల‌కు […]

అణ్వ‌స్త్రాలు లేకుండానే అభివృద్ధి: జ‌పాన్ ప్ర‌ధాని 
X
హిరోషిమా న‌గ‌రంపై అణుబాంబు దాడి జ‌రిగి గురువారానికి 70 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా హిరోషిమాలోని మెమోరియ‌ల్ పీస్ పార్క్‌లో జ‌రిగిన సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే పాల్గొన్నారు. బాంబుదాడిలో మృతి చెందిన వారికి నివాళి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అణ్వ‌స్త్ర ర‌హితంగానే జ‌పాన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. భ‌యంక‌ర‌మైన దాడి నుంచి హిరోషిమా కోలుకొని ప్ర‌పంచంలోనే అభివృద్ది చెందిన న‌గ‌రంగా నిలిచింద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచ‌దేశాల‌కు హిరోషిమా శాంతి ఆవ‌శ్య‌క‌త‌ను తెలుపుతుంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త ప్ర‌ధాని మోడీ కూడా హిరోషిమా మృతుల‌కు నివాళి ఘ‌టించారు. ఆరోజు జ‌రిగిన బాంబు దాడి భ‌యంక‌ర దృశ్యాల‌ను గుర్తు చేస్తుంద‌ని, మాన‌వ‌త్వంపై యుద్ధం ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపుతుందో అమెరికా దాడిని చూస్తే అర్థం చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు.
First Published:  7 Aug 2015 2:11 AM GMT
Next Story