Telugu Global
Others

కొత్త అంబులెన్స్‌ల‌కు రూ.60 కోట్లు విడుద‌ల 

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యం, భ‌ద్ర‌త కోసం పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగా 145 అంబులెన్స్‌ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. వాటిని కొనుగోలు చేసేందుకు రూ 60 కోట్లు విడుద‌ల చేసింది. 145 అంబులెన్స్‌లో 60 ఐసీయూ స్థాయి వాహ‌నాలు. ఎస్ఎన్‌సీయూ యూనిట్ల‌కు 10 అంబులెన్స్‌ల‌ను కేటాయించింది.  నూత‌న అంబులెన్స్ వాహ‌నాల్లో జీపీఎస్‌, ఆడియో వీడియో రికార్డింగ్‌ సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించ‌నున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద 316 అంబులెన్స్‌లు ఆన్‌రోడ్‌పై ఉండ‌గా, 21 […]

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యం, భ‌ద్ర‌త కోసం పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగా 145 అంబులెన్స్‌ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. వాటిని కొనుగోలు చేసేందుకు రూ 60 కోట్లు విడుద‌ల చేసింది. 145 అంబులెన్స్‌లో 60 ఐసీయూ స్థాయి వాహ‌నాలు. ఎస్ఎన్‌సీయూ యూనిట్ల‌కు 10 అంబులెన్స్‌ల‌ను కేటాయించింది. నూత‌న అంబులెన్స్ వాహ‌నాల్లో జీపీఎస్‌, ఆడియో వీడియో రికార్డింగ్‌ సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించ‌నున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద 316 అంబులెన్స్‌లు ఆన్‌రోడ్‌పై ఉండ‌గా, 21 అంబులెన్స్‌లు రిజ‌ర్వ్‌లో ఉన్నాయి. వీటిలో 121 ప‌ని చేయ‌డం లేదు. అందువ‌ల్ల కొత్త వాటిని కొనుగోలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
First Published:  6 Aug 2015 1:06 PM GMT
Next Story