Telugu Global
Others

తెలంగాణ‌కు కేంద్రం  రూ. 4,700 కోట్ల  నిధులు మంజూరు 

రాష్ట్రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా, పంపిణీ వ్య‌వ‌స్థ‌ల బ‌లోపేతానికి రూ. 4,700 కోట్ల నిధుల‌ను కేటాయించేందుకు కేంద్రం సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింది. ఏన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన  అంద‌రికీ విద్యుత్ ( ప‌వ‌ర్ ఫ‌ర్ ఆల్‌) ప‌థ‌కం కింద ఈ ఏడాదే ఆ నిధుల‌ను విడుద‌ల చేసేందుకు సానుకూల‌త వ్య‌క్తం చేసింది. ఇందులో దాదాపు రూ. 700 కోట్ల విడుద‌ల‌కు సంబంధించి క‌చ్చిత‌మైన హామీ ల‌భించింది.  ప‌వ‌ర్ ఫ‌ర్ ఆల్ ప‌థ‌కానికి ఏపీ, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసిన కేంద్రం […]

రాష్ట్రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా, పంపిణీ వ్య‌వ‌స్థ‌ల బ‌లోపేతానికి రూ. 4,700 కోట్ల నిధుల‌ను కేటాయించేందుకు కేంద్రం సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింది. ఏన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అంద‌రికీ విద్యుత్ ( ప‌వ‌ర్ ఫ‌ర్ ఆల్‌) ప‌థ‌కం కింద ఈ ఏడాదే ఆ నిధుల‌ను విడుద‌ల చేసేందుకు సానుకూల‌త వ్య‌క్తం చేసింది. ఇందులో దాదాపు రూ. 700 కోట్ల విడుద‌ల‌కు సంబంధించి క‌చ్చిత‌మైన హామీ ల‌భించింది. ప‌వ‌ర్ ఫ‌ర్ ఆల్ ప‌థ‌కానికి ఏపీ, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసిన కేంద్రం ఇప్పుడు తెలంగాణ‌ను కూడా ఆ ప‌థ‌కం ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి అంగీక‌రించింది. అందుకోసం కేటాయించిన నిధుల్లో తొలి విడ‌త‌గా రూ.700 కోట్లు విడుద‌ల చేసేందుకు అంగీక‌రించింది.
First Published:  7 Aug 2015 1:11 PM GMT
Next Story