Telugu Global
Cinema & Entertainment

అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సిసింద్రీ అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ను విడుదలచేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తోంది. అయితే ఇప్పుడు జాబితాలోకి నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా కూడా చేరిపోయింది. దీంతో నాగ్ బర్త్ డే కు డబుల్ బొనాంజా సిద్ధమైంది. నాగ్ పుట్టినరోజునాడు అఖిల్ సినిమా విశేషాలతో పాటు నాగ్ నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. […]

అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా
X
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సిసింద్రీ అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ను విడుదలచేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తోంది. అయితే ఇప్పుడు జాబితాలోకి నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా కూడా చేరిపోయింది. దీంతో నాగ్ బర్త్ డే కు డబుల్ బొనాంజా సిద్ధమైంది. నాగ్ పుట్టినరోజునాడు అఖిల్ సినిమా విశేషాలతో పాటు నాగ్ నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొడుకులు నాగచైతన్య, అఖిల్ తో సమానంగా నాగార్జున కూడా సెట్స్ లో బిజీగా గడిపేస్తున్నాడు. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా అనే డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు ఆడియో విడుదల, సినిమా విడుదల తేదీల్నిప్రకటించే ఉద్దేశంలో ఉన్నాడు నాగార్జున. ఈనెల 29న నాగార్జున పుట్టినరోజు.
First Published:  7 Aug 2015 9:26 PM GMT
Next Story