Telugu Global
Others

ఏ నూనెలో ఏముంది?

అనారోగ్య కార‌కాలుగా మనం చెప్పుకునే ప‌దార్థాల్లో నూనె త‌ప్ప‌కుండా ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌న్నా, గుండె ఆరోగ్యంగా ఉండాల‌న్నా నూనె వాడ‌కాన్ని త‌గ్గించ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే నూనె లేని వంటిల్లు, నూనె వాడ‌ని కూర‌లు, వంట‌కాలు దాదాపు ఉండ‌వు. నూనెల్లో ఉన్న కొవ్వు అంతా చెడు చేసేదే కాదు, నూనెల‌తో ఆరోగ్య  లాభాలూ ఉన్నాయి. అయితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌కోసం వీటిని వాడ‌ద‌ల‌చుకుంటే నిపుణుల స‌ల‌హా తీసుకుంటే మంచిది. సాధార‌ణంగా మ‌నం వాడే నూనెల్లో  జంతుసంబంధిత‌, వృక్ష సంబంధిత నూనెలు ఉంటాయి. ఇందులో వృక్ష […]

ఏ నూనెలో ఏముంది?
X

అనారోగ్య కార‌కాలుగా మనం చెప్పుకునే ప‌దార్థాల్లో నూనె త‌ప్ప‌కుండా ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌న్నా, గుండె ఆరోగ్యంగా ఉండాల‌న్నా నూనె వాడ‌కాన్ని త‌గ్గించ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే నూనె లేని వంటిల్లు, నూనె వాడ‌ని కూర‌లు, వంట‌కాలు దాదాపు ఉండ‌వు. నూనెల్లో ఉన్న కొవ్వు అంతా చెడు చేసేదే కాదు, నూనెల‌తో ఆరోగ్య లాభాలూ ఉన్నాయి. అయితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌కోసం వీటిని వాడ‌ద‌ల‌చుకుంటే నిపుణుల స‌ల‌హా తీసుకుంటే మంచిది. సాధార‌ణంగా మ‌నం వాడే నూనెల్లో జంతుసంబంధిత‌, వృక్ష సంబంధిత నూనెలు ఉంటాయి. ఇందులో వృక్ష సంబంధిత నూనెలు ఆరోగ్యానికి మంచివ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు క‌దా…అలాంటివే కొన్ని-

-రైస్ బ్రాన్ ఆయిల్లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే అంశాలున్నాయి. ఇందులో ఉన్న మోనో సాచురేటెడ్ అమినో ఆసిడ్స్ కొవ్వు శాతాన్ని త‌గ్గించి బ్రెస్ట్ క్యాన్స‌ర్‌ని, గుండె జ‌బ్బుల‌ను నివారిస్తాయి. అలాగే అధిక బ‌రువు, రుమటాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారు దీనిని వినియోగించ‌డం మేలు. మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే రూము టెంప‌రేచ‌రులో ద్ర‌వ రూపంలో ఉండి, త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లో గ‌డ్డ‌క‌డ‌తాయి. రైస్ బ్రాన్ ఆయిల్లో స‌హ‌జ‌మైన యాంటీ ఆక్సిడెంటు విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మానికి మేలు చేస్తుంది.అలాగే ఈ నూనెలో ఇన్సులిన్‌ని శ‌రీరం వినియోగించుకునేలా చేసే అంశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

-ఆలివ్ ఆయిల్లో ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను త‌గ్గించే యాంటీ ఆక్సిడెంటు ఉంది. ఇది పార్కిన్స‌న్స్, అల్జీమ‌ర్స్ వ్యాధుల‌ను నివారిస్తుంది. ఇది హార్ట్ ఎటాక్‌, హార్ట్ స్ట్రోక్‌ల‌ను నివారించే ల‌క్ష‌ణాల‌ను సైతం క‌లిగి ఉంది.

-స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ క్యాన్స‌ర్ పేషంట్లు వాడ‌ద‌గిన‌ది. ఇది గుండెజ‌బ్బులను నివారిస్తుంది. ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఇది మంచిది. ఇది స‌హ‌జంగానే విష‌ప‌దార్థాల‌ను శ‌రీరం నుండి తొలగించే యాంటీ ఆక్సిడెంటుగా ప‌నిచేస్తుంది. కొలోన్ క్యాన్స‌ర్ రాకుండా నివారిస్తుంది. రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతుంది. న‌రాల వ్య‌వ‌స్థ‌ని ఉత్తేజితం చేస్తుంది. శ‌రీరాన్ని రిపేర్ చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

-ఆవ‌నూనెని త‌గిన మోతాదులో తీసుకుంటే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మేలు చేస్తుంది, ఆక‌లిని పెంచుతుంది. ఇందులో బ్యాక్టీరియా, వైర‌స్‌ల మీద పోరాడి ద‌గ్గు, జ‌లుబు, చ‌ర్మ‌వ్యాధుల‌ను త‌గ్గించే ల‌క్ష‌ణాలు ఉన్నాయి.

-నువ్వుల నూనెలో ఔష‌ధ గుణాలు ఎక్కువ ఉన్నాయి. మ‌ధుమేహం ఉన్న‌వారికి మంచిది. ర‌క్త‌పోటుని త‌గ్గిస్తుంది. నోరు, ప‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. డిప్రెష‌న్, క్యాన్స‌ర్ల‌ను నివారిస్తుంది.

-కొబ్బ‌రి నూనె బ్యాక్టీరియా మీద పోరాడుతుంది. ఇందులో గ‌డ్డ క‌ట్టే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నా అవి ఆరోగ్యానికి మేలు చేసేవే. మెట‌బాలిజం శ‌క్తిని, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

-సోయాబీన్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉన్నాయి. ఇవి గుండెసంబంధిత వ్యాధుల‌ను నివారిస్తాయి.

-వేరుశ‌న‌గ నూనెలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉన్నాయి. ఈ నూనె గుండె జ‌బ్బులు, కొన్ని ర‌కాల క్యాన్స‌ర్లు, న‌రాల జ‌బ్బులను కొంత‌వ‌ర‌కు నివారించ‌గ‌లుగుతుంది.

First Published:  7 Aug 2015 2:40 PM GMT
Next Story