Telugu Global
Others

ఉద్యోగుల పిల్లలకు స్థానికత బెంగ!

ఆంద్రప్రదేశ్‌కు వెళ్ళబోతున్న ఉద్యోగులకు ఇపుడు వారి పిల్లల గురించి బెంగ పట్టుకుంది. రాజధాని పేరుతో వీరంతా వెళితే వారి పిల్లలు అక్కడ స్థానికేతురులుగా చెలామణి అవ్వాల్సి ఉంటుందన్నది వారి బెంగకు కారణం. దీన్నుంచి మినహాయింపు పొందాలంటే ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులను మార్పు చేయడం ఒక్కటే మార్గం. ఉద్యోగులు ఇదే అంశంపై తమ ఆందోళనను ప్రభుత్వం ముందు వ్యక్తం చేయడంతో వారి డిమాండు మేరకు ఈ సవరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించేందుకు కసరత్తు ప్రారంభించింది. […]

ఉద్యోగుల పిల్లలకు స్థానికత బెంగ!
X
ఆంద్రప్రదేశ్‌కు వెళ్ళబోతున్న ఉద్యోగులకు ఇపుడు వారి పిల్లల గురించి బెంగ పట్టుకుంది. రాజధాని పేరుతో వీరంతా వెళితే వారి పిల్లలు అక్కడ స్థానికేతురులుగా చెలామణి అవ్వాల్సి ఉంటుందన్నది వారి బెంగకు కారణం. దీన్నుంచి మినహాయింపు పొందాలంటే ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులను మార్పు చేయడం ఒక్కటే మార్గం. ఉద్యోగులు ఇదే అంశంపై తమ ఆందోళనను ప్రభుత్వం ముందు వ్యక్తం చేయడంతో వారి డిమాండు మేరకు ఈ సవరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించేందుకు కసరత్తు ప్రారంభించింది. వాస్తవంగా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ మేరకు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లపాటు ఎక్కడ చదివితే వారికి ఆ ప్రాంతంలో స్థానికత వర్తిస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర విభజన సమయంలో కూడా చట్టంలో ప్రస్తావించారు. దీంతో చాలాకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న వారిపై రెరడు రాష్ట్రాల మధ్య వివాదం కూడా చోటుచేసుకుంది. చట్టం, ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్స్‌ మేరకు అనేక మంది హైదరాబాద్‌కు స్థానికులుగా మారిపోయారు. వారిలో ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వారు తమ తల్లిదండ్రులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు వెళితే ఆ పిల్లలంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి స్థానికేతరులుగా మారిపోతారు. ఉద్యోగులు కూడా దీనిపైనే ఆందోళన చెందుతున్నారు. ఈ విధానం కొనసాగితే సొంత రాష్టంలో తమ పిల్లలు స్థానికేతరులుగా విద్య, ఉద్యోగాల అవకాశాల్లో కేవలం 15 శాతం సీట్లకే పరిమితమవుతారని, దీనివల్ల తమ పిల్లల భవిష్యత్తు అంధకారమైపోతుందని ఉద్యోగులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, తమ పిల్లలు ఆంధ్రాలో స్థానికులుగా గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందని, అలా కాకుండా హైదరాబాద్‌లో ఉంటున్న పిల్లలకు ఆంధ్రాలో స్థానికత్వం ఇవ్వడం సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే చట్ట సవరణ కోసం కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలోనే అన్ని అంశాలతో ప్రతిపాదనలు పంపిస్తామని వ్యాఖ్యానించారు.
First Published:  8 Aug 2015 12:17 AM GMT
Next Story