Telugu Global
Others

ఆఫీసుల నిండా మృగాళ్లు

మ‌న‌దేశంలో జాబ్ చేస్తున్న మ‌హిళ‌లు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. ఆఫీసుల్లో భ‌యంక‌ర‌మైన టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు.  నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు దాటి రోడ్డుమీద అడుగుపెట్ట‌డం పాపం తోడేళ్ల చూపులు వెంటాడుతున్నాయి. ఏడాదిలో 526 కేసులు మ‌హిళ‌ల‌పై ప‌నిచేసేచోట లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆఫీసులు, క‌ర్మాగారాలు ఇలా ప‌నిచేసేచోటు ఏదైనా..మృగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఒక్క 2014లోనే ప‌నిచేసేచోట లైంగిక వేధింపులకు సంబంధించి 526 కేసులు న‌మోద‌య్యాయి. అందులో 54 కేసులు ఆఫీసులో వేధింపుల‌కు సంబంధించిన‌వికాగా., ఆఫీస్ చుట్టుప‌క్క‌ల టార్చ‌ర్ అనుభ‌విస్తున్నామ‌ని 469 కేసులు […]

ఆఫీసుల నిండా మృగాళ్లు
X

మ‌న‌దేశంలో జాబ్ చేస్తున్న మ‌హిళ‌లు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. ఆఫీసుల్లో భ‌యంక‌ర‌మైన టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు. నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు దాటి రోడ్డుమీద అడుగుపెట్ట‌డం పాపం తోడేళ్ల చూపులు వెంటాడుతున్నాయి.

ఏడాదిలో 526 కేసులు
మ‌హిళ‌ల‌పై ప‌నిచేసేచోట లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆఫీసులు, క‌ర్మాగారాలు ఇలా ప‌నిచేసేచోటు ఏదైనా..మృగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఒక్క 2014లోనే ప‌నిచేసేచోట లైంగిక వేధింపులకు సంబంధించి 526 కేసులు న‌మోద‌య్యాయి. అందులో 54 కేసులు ఆఫీసులో వేధింపుల‌కు సంబంధించిన‌వికాగా., ఆఫీస్ చుట్టుప‌క్క‌ల టార్చ‌ర్ అనుభ‌విస్తున్నామ‌ని 469 కేసులు న‌మోద‌య్యాయి. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో అందించిన ఈ వివ‌రాల‌ను కేంద్ర మ‌హిళా శిశ సంక్షేమ‌శాఖ‌ మంత్రి మేన‌కాగాంధీ పార్ల‌మెంటు ముందుంచారు.

అమ‌లుకాని నిబంధ‌న‌లుః
నిజానికి ప‌నిచేసేచోట మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల నిరోధ‌క చ‌ట్టం 2013 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌తి కార్యాల‌యం, కంపెనీ, కార్పొరేట్ సంస్థ‌ల్లో అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీని ఏర్పాటుచేయాలి. కంపెనీల చ‌ట్టంలో కూడా కంప్లైంట్ సెల్ ఏర్పాటు త‌ప్ప‌నిస‌ర‌ని పేర్కొన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న‌మ‌హిళ‌లు ధైర్యంగా ఫిర్యాదుచేసేందుకు కంప్లైంట్ సెల్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించారు. ప్ర‌తి ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు, క‌ర్మాగారాలు.. ఇలా ప‌నిచేసే ప్ర‌తిచోటా ఫిర్యాదుల క‌మిటీ ఉండాల్సిందేన‌ని కేంద్రం రాష్ర్టాల‌కు స్ప‌ష్టం చేసింది. అయితే ఏ రాష్ర్టంలో చ‌ట్టం స‌మ‌ర్థంగా అమ‌లు కావ‌డం లేదు.

ప్ర‌తి అర సెక‌నుకీ వేధింపులు
మ‌న దేశంలో ప్ర‌తి అర‌సెక‌నుకీ ఓ మ‌హిళ ఇంటా బ‌య‌టా వేధింపుల‌కు గుర‌వుతోంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అలాంటిది దేశం మొత్తంమ్మీద 526 లైంగిక వేధింపుల‌ కేసులే న‌మోద‌య్యాయంటే.. ధైర్యంగా వ‌చ్చి కేసులు పెట్టిన మ‌హిళ‌లు అతికొద్దిమంది మాత్ర‌మేన‌ని అర్థ‌మవుతోంది. వేధింపుల నిరోధ‌క చ‌ట్టం స‌మ‌ర్థంగా అమ‌ల‌యితే ఈ సంఖ్య క‌నీసం వేల‌ల్లో ఉంటుంది. దోషులుగా తేలిన మృగాళ్ల‌పై తీసుకుంటున్న చ‌ర్య‌లు కూడా అంతంత‌మాత్ర‌మే! అస‌లు ఆఫీస్‌లో మ‌హిళ‌లతో వెకిలి చేష్ట‌లు చేయాల‌న్న ఆలోచ‌న రావ‌డానికి కూడా భ‌య‌ప‌డేంత‌గా శిక్ష‌లుండాలంటున్నాయి మ‌హిళా స‌మాఖ్య‌లు!

First Published:  7 Aug 2015 11:53 PM GMT
Next Story