Telugu Global
Cinema & Entertainment

ఇంటిపేరు లేని రాజ‌మౌళి ఫ్యామిలీ

ఎస్ ఎస్ రాజ‌మౌళి..తెలియ‌ని వారే ఉండ‌రు. ఎస్‌.ఎస్ అంటే చాలా మంది రాజ‌మౌళి ఇంటి పేర‌నుకుంటారు. కానీ జ‌క్క‌న్న త‌న ఇంటిపేరును ఎక్క‌డా క‌న‌బ‌డ‌నివ్వడు. ఎస్ ఎస్ రాజ‌మౌళి అంటే  శ్రీశైల శ్రీ  రాజ‌మౌళి అన్న‌మాట‌.  ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ ఉంది. ఎస్ ఎస్ రాజ‌మౌళికి పెద‌నాన్న కొడుకు ఎంఎం కీర‌వాణి. ఎం.ఎం. మీన్స్ మ‌ర‌క‌త‌మ‌ణి. ఇది కూడా ఆయ‌న ఇంటి పేరు కాదు. కీర‌వాణి జాత‌కానికి సూట‌య్యే ల‌క్కీ స్టోన్ మ‌ర‌క‌త‌మ‌ణి. దీనినే ఇంటిపేరుగా మ‌లుచుకున్నారు […]

ఇంటిపేరు లేని రాజ‌మౌళి ఫ్యామిలీ
X

ఎస్ ఎస్ రాజ‌మౌళి..తెలియ‌ని వారే ఉండ‌రు. ఎస్‌.ఎస్ అంటే చాలా మంది రాజ‌మౌళి ఇంటి పేర‌నుకుంటారు. కానీ జ‌క్క‌న్న త‌న ఇంటిపేరును ఎక్క‌డా క‌న‌బ‌డ‌నివ్వడు. ఎస్ ఎస్ రాజ‌మౌళి అంటే శ్రీశైల శ్రీ రాజ‌మౌళి అన్న‌మాట‌. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ ఉంది. ఎస్ ఎస్ రాజ‌మౌళికి పెద‌నాన్న కొడుకు ఎంఎం కీర‌వాణి. ఎం.ఎం. మీన్స్ మ‌ర‌క‌త‌మ‌ణి. ఇది కూడా ఆయ‌న ఇంటి పేరు కాదు. కీర‌వాణి జాత‌కానికి సూట‌య్యే ల‌క్కీ స్టోన్ మ‌ర‌క‌త‌మ‌ణి. దీనినే ఇంటిపేరుగా మ‌లుచుకున్నారు కీర‌వాణి. ఈయ‌నా త‌న ఇంటి పేరు ఎక్క‌డా రాసుకోరు. కీర‌వాణి చెల్లెలు శ్రీలేఖ‌..అన్న‌కు క‌లిసొచ్చిన ల‌క్కీస్టోన్‌నే త‌న ఇంటిపేరుగా మ‌ర‌క‌త‌మ‌ణి (ఎంఎం) శ్రీలేఖ‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈమె కూడా ఇంటిపేరుకు దూరం. రాజ‌మౌళి భార్య ర‌మ‌. ఆమె కూడా ఇంటికి పేరు దూర‌మై భ‌ర్త‌పేరు చివ‌ర త‌గిలించుకుని ర‌మారాజ‌మౌళిగా ఇండ‌స్ర్టీలో ప‌నిచేస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు క‌ల్యాణి మాలిక్. ఈయ‌నా కీర‌వాణి సోద‌రుడు. త‌న‌వారిలాగే ఇంటిపేరుకు దూర‌మై క‌ల్యాణిమాలిక్‌గానే చాలా రోజులు కొన‌సాగాడు. అయితే స‌క్సెస్‌లు వ‌చ్చినా అవ‌కాశాలు రాక‌పోయేస‌రికి త‌న పేరును క‌ళ్యాణి కోడూరిగా మార్చుకున్నాడు. ఈ ఫ్యామిలీ అంత‌టికీ ఆదిగురువులాంటి వాడు ఎస్ ఎస్ రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్. ఈయ‌నా త‌న ఇంటి పేరును నిన్న మొన్న‌టివ‌ర‌కూ ఎక్క‌డా క‌న‌ప‌డ‌నిచ్చేవాడు కాదు. ఎన్ని హిట్ సినిమాల‌కు క‌థ‌లు ఇచ్చినా వి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గానే ఆయ‌న ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌యం. అయితే బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయిజాన్ క‌థ‌ల‌తో వి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ త‌న ఇంటిపేరును ఇంట‌ర్వ్యూల సంద‌ర్భంగా పేర్కొనాల్సి వ‌చ్చేది. అలా బ‌య‌ట‌ప‌డిన ఇంటిపేరే కోడూరి. ఈ ఇంటి పేరు నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖులంతా ఆ పేరును ఎందుకో వాడుకోరు. మొత్తం ఫ్యామిలీ అంతా లక్కీ స్టోన్లు, న్యూమరాలజీ , గ్రాఫాలజీ, ఫెంగ్ షుయి, జాత‌కాలు, సెంటిమెంట్ల‌కు అనుగుణంగానే త‌మ పేర్ల‌ను మార్చుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో త‌మ పూర్వీకుల నుంచి వ‌చ్చిన కోడూరి ఇంటిపేరును చాలావ‌ర‌కూ దూరం చేసుకున్నారు. ఏమో ఏం సెంటిమెంటో మ‌రి?

First Published:  8 Aug 2015 12:00 AM GMT
Next Story