Telugu Global
Cinema & Entertainment

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ర‌మ్య‌కృష్ణ !

మ‌న‌దేశంలో సినిమాతార‌ల‌కు ఉన్న జ‌నాద‌ర‌ణ అంతా ఇంతాకాదు. ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన్న న‌టులు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేశారు. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తార‌లుగా వెలుగువెలిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వివిధ ప‌ద‌వులు చేప‌డుతున్న వారి సంఖ్య‌కు లెక్కేలేదు. ఈ సంప్ర‌దాయం ప్ర‌స్తుతం కూడా కొన‌సాగుతోంది.వారి జాబితాలో ర‌మ్య‌కృష్ణ కూడా చేరారు. త్వ‌ర‌లోనే ఆమె ముఖ్య‌మంత్రి కానున్నారు. అది ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కాదు. వెండితెర‌మీద‌! ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత‌చ‌రిత్ర‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జ‌య‌ల‌లిత […]

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ర‌మ్య‌కృష్ణ !
X
మ‌న‌దేశంలో సినిమాతార‌ల‌కు ఉన్న జ‌నాద‌ర‌ణ అంతా ఇంతాకాదు. ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన్న న‌టులు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేశారు. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తార‌లుగా వెలుగువెలిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వివిధ ప‌ద‌వులు చేప‌డుతున్న వారి సంఖ్య‌కు లెక్కేలేదు. ఈ సంప్ర‌దాయం ప్ర‌స్తుతం కూడా కొన‌సాగుతోంది.వారి జాబితాలో ర‌మ్య‌కృష్ణ కూడా చేరారు. త్వ‌ర‌లోనే ఆమె ముఖ్య‌మంత్రి కానున్నారు. అది ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కాదు. వెండితెర‌మీద‌! ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత‌చ‌రిత్ర‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జ‌య‌ల‌లిత వ్య‌క్తిత్వానికి స‌రిగ్గా స‌రిపోయే న‌టి ఎవ‌ర‌ని అన్వేష‌ణ కూడా సాగుతోంది. ఆ అన్వేష‌ణ ర‌మ్య‌కృష్ణ ద‌గ్గ‌ర ఆగిపోయింద‌ని స‌మ‌చారం. ర‌మ్య‌కృష్ణ ఇప్ప‌టికే న‌ర‌సింహా (ప‌డ‌య‌ప్పా) చిత్రంలో జ‌య‌లలిత పాత్ర‌ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన నీలాంబ‌రి పాత్రను పోషించారు. ఆ పాత్ర‌కు తెలుగు, త‌మిళ‌జ‌నాలు నీరాజ‌నాలు ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విడుద‌లైన బాహుబ‌లిలోనూ రాజ‌మాత శివ‌గామిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నారు. అంత‌లోనే జ‌య‌ల‌లిత జీవిత‌చ‌రిత్ర‌లో న‌టించే అవ‌కాశం ర‌మ్య‌కృష్ణ త‌లుపు త‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై ర‌మ్య‌కృష్ణ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ట‌. నిజంగా ఆ పాత్ర వ‌స్తే చేయ‌డానికి త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెబుతోంద‌ట.
First Published:  7 Aug 2015 10:28 PM GMT
Next Story