Telugu Global
Others

మీ వెనుక మేం ఉన్నాం: ఓయూ విద్యార్థులతో సోనియా

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కి ఉత్తుత్తి ప్రకటనలతో కాలం వెళ్ళదీస్తుందని, ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తోందని ఆమె దుయ్యబట్టారు. శనివారం తనను కలిసిన ఉస్మానియో యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఇప్పుడు ఊరుకొక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు సోనియా వద్ద తమ ఆవేదనను వ్యక్తం […]

మీ వెనుక మేం ఉన్నాం: ఓయూ విద్యార్థులతో సోనియా
X
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కి ఉత్తుత్తి ప్రకటనలతో కాలం వెళ్ళదీస్తుందని, ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తోందని ఆమె దుయ్యబట్టారు. శనివారం తనను కలిసిన ఉస్మానియో యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఇప్పుడు ఊరుకొక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు సోనియా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని వారు సోనియాగాంధీకి తెలిపారు. దాంతో సోనియా ఈ విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు జరిపే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియా విద్యార్థులతో అన్నారు. కేసీఆర్‌ ఒక్కరితోనే ఏ పనులూ జరగవని, రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులు కష్టపడాలని ఆమె సూచించారు. తెలంగాణ కోసం తాము అలుపెరగకుండా ఉద్యమం చేశామని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ తన చిత్తశుద్ధిని ప్రకటించుకుందని ఓయూ విద్యార్థులు మీడియాతో చెప్పారు. మధ్యలో వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వ పగ్గాలు దక్కించుకుని నియంతలాగా వ్యవహరిస్తున్నారనీ, యూనివర్శిటీకి వీసీ, సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
First Published:  8 Aug 2015 2:57 AM GMT
Next Story