Telugu Global
Cinema & Entertainment

లారెన్స్ నెక్ట్స్ సినిమా ఎవరితో..

ప్రస్తుతం లారెన్స్ రెండు కథలు అనుకున్నాడు. ఆ రెండు కథలు పట్టుకొని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాడు. డీటెయిల్స్ మాత్రం మీడియాతో చెప్పడం లేదు. ఏదొ ఒకటి కన్ ఫర్మ్ అయ్యాక చెబుతానంటున్నాడు. తాజాగా ఈ కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ దర్శకుడు జ్యోతికతో భేటీ అయ్యాడు. ఆమెకు ఓ స్టోరీ వినిపించాడు. కాంచన-2తో సక్సెస్ అందుకున్న లారెన్స్, దాదాపు అలాంటి కథనే జ్యోతికకు వినిపించినట్టు సమాచారం. హారర్-కామెడీ సబ్జెక్ట్ తో తెరకెక్కనున్న […]

లారెన్స్ నెక్ట్స్ సినిమా ఎవరితో..
X
ప్రస్తుతం లారెన్స్ రెండు కథలు అనుకున్నాడు. ఆ రెండు కథలు పట్టుకొని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాడు. డీటెయిల్స్ మాత్రం మీడియాతో చెప్పడం లేదు. ఏదొ ఒకటి కన్ ఫర్మ్ అయ్యాక చెబుతానంటున్నాడు. తాజాగా ఈ కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ దర్శకుడు జ్యోతికతో భేటీ అయ్యాడు. ఆమెకు ఓ స్టోరీ వినిపించాడు. కాంచన-2తో సక్సెస్ అందుకున్న లారెన్స్, దాదాపు అలాంటి కథనే జ్యోతికకు వినిపించినట్టు సమాచారం. హారర్-కామెడీ సబ్జెక్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించేందుకు జ్యోతిక కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. తన భర్త సూర్య స్థాపించిన బ్యానర్ పైనే లారెన్స్ డైరక్షన్ లో సినిమా చేసేందుకు జ్యోతిక అంగీకరించిందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు లారెన్స్, కింగ్ నాగార్జునకు కూడా కథ వినిపించాడు. ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో బిజీగా ఉన్న నాగ్, ఈ నెలాఖరుకు లారెన్స్ కు క్లారిటీ ఇస్తానని చెప్పాడట. మరి లారెన్స్ దారెటు..? నాగార్జునతో సెట్స్ పైకి వెళ్తాడా.. లేక జ్యోతికతో సినిమా చేస్తాడా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..
First Published:  7 Aug 2015 7:02 PM GMT
Next Story