Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌మంతుడికి సండే టికెట్స్ లేవు..

స్టార్ హీరోల సినిమాకు   పాజిటివ్ టాక్ వ‌స్తే.. వీకెండ్ లో టికెట్స్ దొర‌క‌డం  చాల క‌ష్టం.   ప్రిన్స్ మ‌హేష్ బాబు.. కొరటాల శివ‌, శృతిహాస‌న్ కాంబోలో వ‌చ్చిన  శ్రీ‌మంతుడు సినిమాకు  ఇదే ప‌రిస్థితి.  ముందుగా బుక్ చేసుకున్న వారికే త‌ప్ప ..థియేట‌ర్ లో స్పాట్ గా టికెట్స్ దొర‌క‌డం లేదు.  హైద‌ర‌బాద్  న‌గ‌రంలో   మ‌ల్టీ ప్లేక్స్ లో  ప‌రిస్థితి  ఘ‌రోంగా ఉంది. అడ్వాన్స్ బుకింక్..ఆన్ లైన్ బుకింగ్ ల‌తో టికెట్స్  అన్ని  ముందుగానే […]

శ్రీ‌మంతుడికి సండే టికెట్స్ లేవు..
X
స్టార్ హీరోల సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. వీకెండ్ లో టికెట్స్ దొర‌క‌డం చాల క‌ష్టం. ప్రిన్స్ మ‌హేష్ బాబు.. కొరటాల శివ‌, శృతిహాస‌న్ కాంబోలో వ‌చ్చిన శ్రీ‌మంతుడు సినిమాకు ఇదే ప‌రిస్థితి. ముందుగా బుక్ చేసుకున్న వారికే త‌ప్ప ..థియేట‌ర్ లో స్పాట్ గా టికెట్స్ దొర‌క‌డం లేదు. హైద‌ర‌బాద్ న‌గ‌రంలో మ‌ల్టీ ప్లేక్స్ లో ప‌రిస్థితి ఘ‌రోంగా ఉంది. అడ్వాన్స్ బుకింక్..ఆన్ లైన్ బుకింగ్ ల‌తో టికెట్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవ‌డంతో… థియేట‌ర్ లో టికెట్స్ దొర‌కుతాయ‌ని వ‌చ్చిన ఆడియ‌న్స్ కు నిరాశ తో వెన‌క్కు వెళ్తున్నారు. అవుటాఫ్ బాక్స్ లో కూడా దొర‌క‌డం లేదు. ఆదివారం సెల‌వు దినం కావ‌డం.. సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డం.. మ‌హేష్ బాబు..శృతి హాస‌న్ జోడి ..ఇలా శ్రీ‌మంతుడు ఆడియ‌న్స్ కు నిజంగానే శ్రీ‌మంతుడు అయ్యింది. అంటే టికెట్ కు పెట్టిన ఖ‌ర్చుకుంటే సినిమా నాణ్యత ఎక్కువుగానే ఉంది.
First Published:  8 Aug 2015 7:15 PM GMT
Next Story