Telugu Global
Cinema & Entertainment

కోలుకుంటున్న రామ్

క్షణం తీరికలేకుండా బిజీబిజీగా గడుపుతున్న రామ్ సడన్‌గా ఫ్రీ అయిపోయాడు. సెట్స్ పై కాలుపెట్టకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చుకున్నాడు. దీనికి కారణం అతడి గాయమే. అవును.. ప్రస్తుతం శివ, హరికథ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు రామ్. ఈ రెండు సినిమాల్నిదశలవారీగా పూర్తిచేస్తున్నాడు. అయితే అనుకోకుండా హరికథ సినిమా షూటింగ్ టైమ్ లో గాయపడ్డాడు రామ్. అతడి మణికట్టుకు పైభాగంలో దెబ్బ తగిలింది. అయినా పట్టించుకోకుండా షూటింగ్ చేయడంలో దెబ్బ తిరగబెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్ […]

కోలుకుంటున్న రామ్
X
క్షణం తీరికలేకుండా బిజీబిజీగా గడుపుతున్న రామ్ సడన్‌గా ఫ్రీ అయిపోయాడు. సెట్స్ పై కాలుపెట్టకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చుకున్నాడు. దీనికి కారణం అతడి గాయమే. అవును.. ప్రస్తుతం శివ, హరికథ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు రామ్. ఈ రెండు సినిమాల్నిదశలవారీగా పూర్తిచేస్తున్నాడు. అయితే అనుకోకుండా హరికథ సినిమా షూటింగ్ టైమ్ లో గాయపడ్డాడు రామ్. అతడి మణికట్టుకు పైభాగంలో దెబ్బ తగిలింది. అయినా పట్టించుకోకుండా షూటింగ్ చేయడంలో దెబ్బ తిరగబెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్ లో చేరిపోయాడు రామ్. రామ్ చేతిని పరీక్షించిన డాక్టర్లు.. 2 వారాలు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చి కట్టుకట్టి ఇంటికి పంపించేశారు. దీంతో చేసేదేం లేక ఇంట్లో కూర్చున్నాడు. ఇన్నాళ్లూ బిజీబిజీగా గడిపిన ఈ యంగ్ హీరో ఇప్పుడు సడన్ గా ఇలా ఫ్రీ అయిపోయాడు. అయితే ఈ గాయం వల్ల తన సినిమాల విడుదల తేదీలపై ఎలాంటి ప్రభావం పడదంటున్నాడు రామ్. శివం సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో.. హరికథ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తానని ప్రకటించాడు.
First Published:  8 Aug 2015 7:00 PM GMT
Next Story