Telugu Global
Cinema & Entertainment

కట్టప్ప వయస్సు మరచిన రాజమౌళి

వంద‌ల కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్ల‌తో రోజుకో రికార్డు బ‌ద్ద‌లు కొడుతున్న బాహుబ‌లి సినిమాను ప్రేక్ష‌కులు మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. సినిమాలో అంద‌రినీ ఆక‌ట్టుకున్న పాత్ర న‌మ్మిన‌బంటు క‌ట్ట‌ప్ప‌. రిటైర‌య్యే వ‌య‌సులోనూ క‌ట్ట‌ప్ప పాత్ర చేసే సాహ‌సాలు తెర‌పై చూసి ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. ఇప్పుడు ప్రేక్ష‌కుల మదిలో మెదులుతున్న ప్ర‌శ్న ఏంటంటే క‌ట్ట‌ప్ప వ‌య‌సు ఎంత‌?  సినిమా ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యంలో 60వ వ‌డిలో ఉన్న‌ట్లు క‌నిపించాడు. క‌ట్ట‌ప్ప చిన్న ప్ర‌భాస్ కి గ‌తం చెప్పేట‌ప్ప‌డు ఈ క‌థ 50 […]

కట్టప్ప వయస్సు మరచిన రాజమౌళి
X
వంద‌ల కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్ల‌తో రోజుకో రికార్డు బ‌ద్ద‌లు కొడుతున్న బాహుబ‌లి సినిమాను ప్రేక్ష‌కులు మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. సినిమాలో అంద‌రినీ ఆక‌ట్టుకున్న పాత్ర న‌మ్మిన‌బంటు క‌ట్ట‌ప్ప‌. రిటైర‌య్యే వ‌య‌సులోనూ క‌ట్ట‌ప్ప పాత్ర చేసే సాహ‌సాలు తెర‌పై చూసి ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. ఇప్పుడు ప్రేక్ష‌కుల మదిలో మెదులుతున్న ప్ర‌శ్న ఏంటంటే క‌ట్ట‌ప్ప వ‌య‌సు ఎంత‌? సినిమా ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యంలో 60వ వ‌డిలో ఉన్న‌ట్లు క‌నిపించాడు. క‌ట్ట‌ప్ప చిన్న ప్ర‌భాస్ కి గ‌తం చెప్పేట‌ప్ప‌డు ఈ క‌థ 50 ఏళ్ల క్రితం మాహిష్మ‌తి సామ్రాజ్యంలో మొద‌లైంద‌ని చెబుతాడు. ఆ క‌థ‌లో క‌ట్ట‌ప్ప మాహిష్మ‌తిపై తిరుగ‌బాటు చేసిన వారిని శివ‌గామి ఆదేశంతో నరికిపారేస్తాడు. అప్పుడు క‌ట్ట‌ప్ప యువ‌కుడు. ఎంత‌లేద‌న్నా అత‌ని వ‌య‌సు 25-30 ఏళ్ల‌కి అటూ ఇటూగా ఉంటుంద‌నుకుందాం. త‌రువాత 50 ఏళ్ల‌కి చిన్న‌ప్ర‌భాస్‌కు జ‌రిగిన క‌థ చెబుతున్నాడు క‌దా! మ‌రి ఇప్పుడు క‌ట్ట‌ప్ప వ‌య‌సు ఎంత‌? లెక్క ప్రకారం చూస్తే.. క‌ట్ట‌ప్ప వ‌య‌సు 75-80 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అంటే అంత ముదిమి వ‌య‌సులోనూ క‌ట్ట‌ప్ప క‌త్తి తిప్ప‌డం సాధ్య‌మా? అని ప్ర‌శ్నించుకుంటున్నారు ప్రేక్ష‌కులు. 85 ఏళ్ల వ‌య‌సులోనూ కేవ‌లం 50 కి అటూ ఇటూగా క‌నిపిస్తోన్న క‌ట్ట‌ప్ప గ్లామ‌ర్ ర‌హ‌స్య‌మేంట‌ని బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు. అయితే, ఎంత అంత‌ర్జాతీయ స్థాయి సినిమా అయినా తెలుగు సినిమా అన్న సంగ‌తి మ‌రిచిపోవ‌ద్ద‌ని మ‌రికొంద‌రు స‌రిపెట్టుకుంటున్నారు.
First Published:  8 Aug 2015 7:10 PM GMT
Next Story