Telugu Global
National

తూర్పుతీరంపై ఉగ్ర‌వాదుల క‌న్ను!

బెంగాల్‌, ఆంద్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడుకు ముప్పు తూర్పుతీరంపై ఉగ్ర‌వాదుల క‌న్నుప‌డిందా… దేశంలో చొర‌బ‌డ‌డానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారా… అవున‌నే అంటున్నాయి కేంద్ర నిఘాసంస్థ‌లు. అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ తూర్పుతీర రాష్ర్టాలైన ప‌శ్చ‌మ‌బెంగాల్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడుల‌కు కేంద్ర నిఘా సంస్థ‌ల నుంచి హెచ్చ‌రిక‌లందాయి. పంద్రాగ‌స్టు వేడుక‌ల‌కు దేశం యావ‌త్తూ స‌మాయ‌త్త‌మ‌వుతున్న ఈ త‌రుణంలో అల‌జ‌డులు సృష్టించేందుకు ముష్క‌ర మూక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని, తూర్పుతీరంపై అవి క‌న్నేశాయ‌ని నిఘావ‌ర్గాలకు స‌మాచార‌మందింది. ఇప్ప‌టివ‌ర‌కు కాశ్మీర్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, గుజ‌రాత్ వంటి ప‌శ్చిమ‌తీర ప్రాంతాల గుండా […]

తూర్పుతీరంపై ఉగ్ర‌వాదుల క‌న్ను!
X
బెంగాల్‌, ఆంద్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడుకు ముప్పు
తూర్పుతీరంపై ఉగ్ర‌వాదుల క‌న్నుప‌డిందా… దేశంలో చొర‌బ‌డ‌డానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారా… అవున‌నే అంటున్నాయి కేంద్ర నిఘాసంస్థ‌లు. అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ తూర్పుతీర రాష్ర్టాలైన ప‌శ్చ‌మ‌బెంగాల్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడుల‌కు కేంద్ర నిఘా సంస్థ‌ల నుంచి హెచ్చ‌రిక‌లందాయి. పంద్రాగ‌స్టు వేడుక‌ల‌కు దేశం యావ‌త్తూ స‌మాయ‌త్త‌మ‌వుతున్న ఈ త‌రుణంలో అల‌జ‌డులు సృష్టించేందుకు ముష్క‌ర మూక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని, తూర్పుతీరంపై అవి క‌న్నేశాయ‌ని నిఘావ‌ర్గాలకు స‌మాచార‌మందింది. ఇప్ప‌టివ‌ర‌కు కాశ్మీర్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, గుజ‌రాత్ వంటి ప‌శ్చిమ‌తీర ప్రాంతాల గుండా ఉగ్ర‌వాదులు మ‌న దేశంలోకి చొర‌బ‌డేవారు. ముంబై దాడుల అనంత‌రం ప‌శ్చిమ‌తీరంలో మ‌న గ‌స్తీ ముమ్మ‌ర‌మ‌య్యింది. దాంతో ఉగ్ర‌వాదులు ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టిపెట్టార‌ని స‌మాచారం. ద‌క్షిణాది రాష్ర్టాల‌లో యువ‌త‌ను ఆక‌ర్షించి వారికి శిక్ష‌ణ ఇచ్చి దాడుల‌కు పురికొల్పేందుకు గాను ఉగ్ర‌వాద సంస్థ‌లు శ్రీ‌లంక‌, మాల్దీవుల‌ను కేంద్రంగా చేసుకున్నాయ‌ని ఇప్ప‌టికే నిఘాసంస్థ‌లు గుర్తించాయి. తూర్పుతీరంలో అనేక స‌హ‌జ‌సిద్ధ‌మైన‌ నౌకాశ్ర‌యాల‌తో పాటు ర‌క్ష‌ణ శాఖకు కీల‌క‌మైన స్థావ‌రాలు, చ‌మురు బావులు ఉన్నాయి. వీటిని ఉగ్ర‌వాదులు టార్గెట్ చేసే ప్ర‌మాద‌ముంద‌ని నిఘా వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సిందిగా తూర్పు తీర ప్రాంతా రాష్ర్టాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.
First Published:  10 Aug 2015 12:17 AM GMT
Next Story