Telugu Global
Others

ఏపీలో ఇక ఇంటికే భూ పట్టాలు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభిస్తున్న‘మీ భూమి… మీ పట్టా’రాష్ర్టానికే ఆదర్శమని, ఇక నుంచి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ‘మీ ఇంటికి మీ భూమి’’ కార్యక్రమాన్ని సోమవారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వాలు భూమి సొంతదారులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాయని, ఎన్నో లిటిగేషన్లు, ఎన్నో సమస్యలు సృష్టించి.. భూమిదారులను ఎన్నో సమస్యలు సృష్టించేవారని విమర్శించారు. ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాత పటేల్‌ […]

ఏపీలో ఇక ఇంటికే భూ పట్టాలు: చంద్రబాబు
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభిస్తున్న‘మీ భూమి… మీ పట్టా’రాష్ర్టానికే ఆదర్శమని, ఇక నుంచి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ‘మీ ఇంటికి మీ భూమి’’ కార్యక్రమాన్ని సోమవారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వాలు భూమి సొంతదారులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాయని, ఎన్నో లిటిగేషన్లు, ఎన్నో సమస్యలు సృష్టించి.. భూమిదారులను ఎన్నో సమస్యలు సృష్టించేవారని విమర్శించారు. ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాత పటేల్‌ పట్వారీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని పెట్టి రైతుకు చేరువయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల 24 లక్షల సర్వే నెంబర్లు ఉన్నాయని, అందులో 72 లక్షల మంది పట్టాదారులు ఉన్నారని, ఒక సర్వేలో ముగ్గురు, నలుగురు ఉండవచ్చని, అదే సర్వే నెంబరులో ప్రభుత్వ భూమి కూడా ఉంటుందని, అదే మాదిరిగా పట్టాదారులు ఉంటారని ఆయన అన్నారు. ఒకే సర్వే నెంబర్‌లో ఎంతమంది ఉన్నా సమస్యలు లేకుండా చేయడమే ఈ పథకం ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ‘మీ ఇంటికి మీ భూమి’ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించామని, భూ వివాదాల నివారణకు ఇది చక్కటి పరిష్కారంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీ భూమి మీపేరుతో ఉందోలేదో తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు.
రెవెన్యూ రికార్డులకు ఆధార్‌ అనుసంధానం చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనవసర సర్టిఫికెట్ల వ్యవస్థను రద్దు చేస్తామని, అవసరమైన వాటి కోసం దరఖాస్తు చేస్తే…నిర్దిష్ట కాల పరిమితిలో నేరుగా ఇంటికే సర్టిఫికెట్లు అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు రేషన్‌కార్డుల ఆధారంగానే స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఫీజు రియంబర్స్‌మెంటుకు ఇన్‌కం సర్టిఫికెట్లు అవసరంలేదని ఆయన అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీని సరళీకృతం చేస్తామని చంద్రబాబు తెలిపారు.
First Published:  10 Aug 2015 5:52 AM GMT
Next Story