Telugu Global
Cinema & Entertainment

మరోసారి విమానమెక్కిన అఖిల్

అక్కినేని సిసింద్రీ ఇక్కడ తక్కువగా, విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఏ ముహూర్తాన సినిమా ప్రారంభించాడో కానీ.. మ్యాగ్జిమమ్ షూటింగ్ విదేశాల్లోనే కానిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 5 దేశాలు చుట్టేసిన ఈ అక్కినేని యంగ్ తరంగ్, తాజాగా మరోసారి ఫ్లయిట్ ఎక్కేశాడు. హీరోయిన్ సాయేషా సైగల్ తో కలిసి యూరోప్ చెక్కేశాడు. ఈమధ్య ఓ వారం రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంది అఖిల్ కొత్త సినిమా. ఇక్కడ కొన్ని సన్నివేశాలు తీసిన తర్వాత ఇప్పుడు హీరోహీరోయిన్లు మధ్య ఓ […]

మరోసారి విమానమెక్కిన అఖిల్
X
అక్కినేని సిసింద్రీ ఇక్కడ తక్కువగా, విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఏ ముహూర్తాన సినిమా ప్రారంభించాడో కానీ.. మ్యాగ్జిమమ్ షూటింగ్ విదేశాల్లోనే కానిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 5 దేశాలు చుట్టేసిన ఈ అక్కినేని యంగ్ తరంగ్, తాజాగా మరోసారి ఫ్లయిట్ ఎక్కేశాడు. హీరోయిన్ సాయేషా సైగల్ తో కలిసి యూరోప్ చెక్కేశాడు. ఈమధ్య ఓ వారం రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంది అఖిల్ కొత్త సినిమా. ఇక్కడ కొన్ని సన్నివేశాలు తీసిన తర్వాత ఇప్పుడు హీరోహీరోయిన్లు మధ్య ఓ సాంగ్ తీసేందుకు మళ్లీ యూరోప్ వెళ్తున్నారు. పాట చిత్రీకరణ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తారు. దీంతో ప్యాచ్ వర్క్ మినహా దాదాపు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 21న విడుదల చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 20న ఆడియో ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ఆగస్ట్ 29న నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను ప్రకటించాలనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే బాలరాజు అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
First Published:  10 Aug 2015 7:01 PM GMT
Next Story