Telugu Global
Others

ఏపీ బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన బంద్‌ దాదాపు సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుకు కాంగ్రెస్‌ కూడా తోడయ్యింది. దీంతో బంద్‌ అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పందన లభించింది.  ఈబంద్‌కు ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలుపగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెట్రోల్‌ బంకులు తెరవలేదు. సినిమా హాళ్ళలో ప్రదర్శనలు జరగలేదు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో […]

ఏపీ బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన బంద్‌ దాదాపు సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుకు కాంగ్రెస్‌ కూడా తోడయ్యింది. దీంతో బంద్‌ అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పందన లభించింది. ఈబంద్‌కు ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలుపగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెట్రోల్‌ బంకులు తెరవలేదు. సినిమా హాళ్ళలో ప్రదర్శనలు జరగలేదు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మొత్తం రాష్ట్రమంతా బంద్‌ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఉత్తరాది జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోను, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంద్‌ ప్రశాంతంగా సాగింది. బంద్‌కు పెట్రోడీలర్ల అసోషియేషన్‌ కూడా మద్దతు ప్రకటించింది. తెల్లవారు జామునుంచే కాంగ్రెస్‌, వామపక్షాలకు చెందిన కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తప్పు చేసి కారణాలు వెతుక్కుంటోందని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న బంద్‌లో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిని ఆర్టీసీ డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా ఆందోళన కారులు ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి బంద్‌కు మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో బంద్‌ సందర్భంగా డిపోలో బస్సులు బయటకు రాకుండా ఆందోళన కారులు అడ్డుకున్నారు. ఏలూరు జూట్‌ మిల్లును మూసి వేయించారు. రాజమండ్రిలో సీపీఐ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్డాండ్‌ వద్ద మానవహారం నిర్వహించారు. కొన్ని చోట్ల బస్సులు సరిగా నడవలేదు. శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనకారులు దుకాణాలు మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను పాక్షికంగా నిలిపివేశారు. కొన్ని చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ జిల్లా అరకులోయలో కూడా బంద్‌ సంపూర్ణంగా జరిగిదంటే ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఎంతగా తపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. విజయనగరం జిల్లాలో బంద్‌ పాక్షికంగా కనిపించింది. బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆందోళనకారులు కాసేపు బస్‌ డిపోలవద్ద బైఠాయించినప్పటికీ ఆ తర్వాత బస్సులు యధావిధిగా తిరిగాయి. ప్రైవేట్‌ విద్యా సంస్థలు స్వచ్చంధంగా బంద్‌ పాటించాయి. సీపీఐ నేతలు, అనుబంధ విద్యా సంఘాలు పలుచోట్ల ర్యాలీ నిర్వహించాయి. విశాఖలో అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ నేతలు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో బంద్‌ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. అనంతపురంలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. విద్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. చిత్తూరు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. పలు విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్‌ పాటించాయి. నెల్లూరు, కావలి బస్టాండ్‌ల వద్ద వామపక్ష నేతలు ఆందోళనకు దిగి, బస్సులను అడ్డుకున్నారు. దీంతో బస్సులు ఆలస్యంగా నడిచాయి.
First Published:  11 Aug 2015 6:38 AM GMT
Next Story