Telugu Global
Others

సానియామీర్జాకు రాజీవ్‌ ఖేల్‌రత్న ఖాయం!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం దక్కనుంది. సానియాకు ఈ అవార్డును సిఫార్సు చేస్తూ క్రీడాశాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర అవార్డ్ ప్యానెల్ మంగళవారం ఆమోదించింది. టెన్నీస్‌లో సానియా మీర్జా సాధించిన గొప్ప విజయాలకు గుర్తింపుగా క్రీడల మంత్రి శర్వానంద సోనోవాల్, ఈ అవార్డుకు ఆమె పేరును ప్రతిపాదించారు. కాగా, ఖేల్‌రత్న అవార్డు కోసం స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కూడా పోటీ పడినప్పటికీ ప్రపంచ […]

సానియామీర్జాకు రాజీవ్‌ ఖేల్‌రత్న ఖాయం!
X
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారం దక్కనుంది. సానియాకు ఈ అవార్డును సిఫార్సు చేస్తూ క్రీడాశాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర అవార్డ్ ప్యానెల్ మంగళవారం ఆమోదించింది. టెన్నీస్‌లో సానియా మీర్జా సాధించిన గొప్ప విజయాలకు గుర్తింపుగా క్రీడల మంత్రి శర్వానంద సోనోవాల్, ఈ అవార్డుకు ఆమె పేరును ప్రతిపాదించారు. కాగా, ఖేల్‌రత్న అవార్డు కోసం స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కూడా పోటీ పడినప్పటికీ ప్రపంచ ప్రశంసలందుకున్న సానియానే ఈ అవార్డు వరించనుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా ప్రపంచ టెన్నిస్‌ రంగం ఇచ్చే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది.
First Published:  11 Aug 2015 6:03 AM GMT
Next Story