Telugu Global
Cinema & Entertainment

ఏక్త క‌పూర్   స్కూల్ అంటే అంతే మ‌రి..!

బాలీవుడ్  ప్రొడ్యూస‌ర్స్ లో  ఏక్త క‌పూర్ స్టైలే వేరు.   హాట్ హాట్ మూవీస్ నిర్మించ‌డంలో మ‌హేష్ భ‌ట్ త‌రువాత   ప్లేస్ హండ్రెట్ ప‌ర్సెంట్  ఏక్త క‌పూర్ కే ఇవ్వాలి.   సౌత్ స్పెష‌ల్ సాంగ్స్ స్పెష‌లిస్ట్   సిల్క్ స్మిత జీవితం ఆధారంగా చేసిన చిత్రం   డ‌ర్జీ పిక్చ‌ర్ ఒక రేంజ్ లో   బి టౌన్ని షేక్ చేసింది. ఈ చిత్రంలో  అప్ప‌టి వ‌ర‌కు   ప‌రిణితి ఇమేజ్ వున్న  విద్యాబాల‌న్ ను   డ‌ర్టీ హీరోయిన్ ఇమేజ్  క్రియోట్ చేసింది.  ఆ […]

ఏక్త క‌పూర్   స్కూల్ అంటే అంతే మ‌రి..!
X

బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ లో ఏక్త క‌పూర్ స్టైలే వేరు. హాట్ హాట్ మూవీస్ నిర్మించ‌డంలో మ‌హేష్ భ‌ట్ త‌రువాత ప్లేస్ హండ్రెట్ ప‌ర్సెంట్ ఏక్త క‌పూర్ కే ఇవ్వాలి. సౌత్ స్పెష‌ల్ సాంగ్స్ స్పెష‌లిస్ట్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా చేసిన చిత్రం డ‌ర్జీ పిక్చ‌ర్ ఒక రేంజ్ లో బి టౌన్ని షేక్ చేసింది. ఈ చిత్రంలో అప్ప‌టి వ‌ర‌కు ప‌రిణితి ఇమేజ్ వున్న విద్యాబాల‌న్ ను డ‌ర్టీ హీరోయిన్ ఇమేజ్ క్రియోట్ చేసింది. ఆ త‌రువాత కూడా ఎన్నో చిత్రాలు చేసింది. ఏది చేసిన దిట్టంగా మ‌సాలా ఉండే చిత్రాలు చేయ‌డంలో ప్రొడ్యూస‌ర్ గా కాంప్ర‌మైజ్ కాదు. మ‌రి ఈవిడ గారి చిత్రాల్లో శృంగారం సెన్సార్ బోర్డ్ వారికి ఎందుకు క‌నిపించదో అర్ధం కాదు .. ఇది డిఫ‌రెంట్ ఇష్యూ.

ఇక ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన ‘గ్రాండ్‌మస్తీ’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన విషయం తెల్సిందే! ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ రాబోతోంది. ఇంద్రకుమార్ డైరెక్షన్‌లో రానున్న ‘గ్రేట్ గ్రాండ్‌మస్తీ’ మూవీని ఏక్తాకపూర్ నిర్మించబోతోంది. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాదాస్ ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. తనకు క్రెడిట్ తెచ్చే రోల్ అని తెలిపింది. రితేష్ దేష్‌ముఖ్, వివేక్ ఓబెరాయ్‌లతో కలిసి ఈ అమ్మడు కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించబోతోందనే ప్రచారం బాలీవుడ్‌లో సాగుతోంది. మొత్తానికి తెలుగులో ఆఫర్లు లేకపోయినా, బాలీవుడ్‌ని ఆకట్టుకునేందుకు తన ప్రయత్నాలు చేస్తోందన్నమాట. మొత్తం మీద ఏక్త క‌పూర్ స్కూల్లో ఎంట్రి కొట్టింది కాబ‌ట్టి.. క‌చ్చితంగా ఈ ముద్దుగుమ్మ ద‌శ తిరిగిన‌ట్లే మ‌రి.!

First Published:  10 Aug 2015 7:04 PM GMT
Next Story