Telugu Global
Others

రాముడి ఆలయం మరమ్మత్తులకు సుప్రీం ఓకే!

అయోధ్యలోని వివాదస్పద బాబ్రీ మసీద్‌ – రామమందిర్ భూమిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రామ్‌లాలా ఆలయం మరమ్మత్తులకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రామజన్మ భూమిలో ఏర్పాటు చేసిన ఆలయం పైకప్పు పరదాల మరమ్మత్తులతోపాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రామ్‌లాలా ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడికి వచ్చే […]

రాముడి ఆలయం మరమ్మత్తులకు సుప్రీం ఓకే!
X
అయోధ్యలోని వివాదస్పద బాబ్రీ మసీద్‌ – రామమందిర్ భూమిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రామ్‌లాలా ఆలయం మరమ్మత్తులకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రామజన్మ భూమిలో ఏర్పాటు చేసిన ఆలయం పైకప్పు పరదాల మరమ్మత్తులతోపాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రామ్‌లాలా ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడికి వచ్చే లక్షలాది భక్తులు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం వంటి కనీస వసతులు పొందలేని స్థితిలో ఉన్నారని, దీనికి కేంద్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యులని ఆయన ఆరోపించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కలగజేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచి 1996లో జారీ చేసిన స్టేటస్ కో ఆదేశాల్లో వివాదస్పద భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మాత్రమే పేర్కొందన్నారు. భక్తులకు వసతి సౌకర్యాలపై కోర్టు మార్చిలో కేంద్రానికి సూచనలు కూడా చేసిందని సుబ్రమణ్యస్వామి ప్రస్తావించారు. దీంతో సుప్రీం కోర్టు రామ్‌లాలా ఆలయంలో స్వల్ప మరమ్మత్తులు, భక్తులకు సౌకర్యాల కల్పనకు అనుమతిస్తూ కీలక తీర్పునిచ్చింది. అయితే ఫజియాబాద్ జిల్లా కలెక్టర్ ఇద్దరు స్వతంత్ర వ్యక్తుల పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
First Published:  11 Aug 2015 4:32 AM GMT
Next Story