Telugu Global
Cinema & Entertainment

తమిళ సినిమా రిమేక్‌తో చిరంజీవి 150వ సినిమా?

ప్రస్తుతం పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ చిరంజీవికి సరైన కథ దొరకడం లేదు. పూరి జగన్నాధ్ తో ఎనౌన్స్ చేసిన ఆటోజానీ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఆగిపోవడంతో ఆ కథ కూడా మిస్సయింది. దీంతో మరోసారి రీమేక్ కథలపై ఫోకస్ పెట్టారట చిరంజీవి. ప్రస్తుతం మలయాళం, తమిళ, హిందీ భాషలకు చెందిన సూపర్ హిట్ చిత్రాలను మెగా కాంపౌండ్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాట విజయవంతమైన కత్తి సినిమాను కూడా చూశారు […]

తమిళ సినిమా రిమేక్‌తో చిరంజీవి 150వ సినిమా?
X
ప్రస్తుతం పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ చిరంజీవికి సరైన కథ దొరకడం లేదు. పూరి జగన్నాధ్ తో ఎనౌన్స్ చేసిన ఆటోజానీ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఆగిపోవడంతో ఆ కథ కూడా మిస్సయింది. దీంతో మరోసారి రీమేక్ కథలపై ఫోకస్ పెట్టారట చిరంజీవి. ప్రస్తుతం మలయాళం, తమిళ, హిందీ భాషలకు చెందిన సూపర్ హిట్ చిత్రాలను మెగా కాంపౌండ్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాట విజయవంతమైన కత్తి సినిమాను కూడా చూశారు చిరు. విజయ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కోలీవుడ్ లో మురుగదాస్ తెరకెక్కించాడు. ఈ సినిమా చిరంజీవికి బాగా నచ్చింది. అయితే ఈ సినిమానే తన 150వ సినిమాగా రీమేక్ చేస్తారా అనే విషయాన్ని మాత్రం కన్ ఫర్మ్ చేయలేదు. కత్తి తెలుగు రీమేక్ రైట్స్ ను ఠాగూర్ మధు దక్కించుకున్నాడు. ఈ సినిమాను మొదట పవన్ కల్యాణ్ కు చూపించారు. కానీ వర్కవుట్ కాలేదు. తర్వాత మహేష్, ఎన్టీఆర్ కూడా చూశారు. కానీ వాళ్లు కూడా కొన్ని కారణాల వల్ల సినిమా చేయడానికి అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు కత్తి రీమేక్ చిరంజీవి చెంతకు చేరింది. మరి చిరు తన 150వ సినిమాగా కత్తిని ప్రకటిస్తారా అనే విషయం ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. మరోవైపు కొన్ని మలయాళం హిట్ సినిమాలపై కూడా చిరంజీవి సీరియస్ గా దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది.
First Published:  11 Aug 2015 7:00 PM GMT
Next Story