Telugu Global
Others

రెండేళ్ల‌లో మిగులు బ‌డ్జెట్

అధికారులకు చంద్ర‌బాబు టార్గెట్‌ రెండేళ్ల‌లో రాష్ట్రంలో మిగులుబ‌డ్జెట్ సాధించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు ల‌క్ష్యం నిర్దేశించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇవాళ‌ రూ. 3 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, వచ్చే రెండేళ్లలో ఆదాయ వనరుల‌ను పెంచ‌డం ద్వారా మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయ‌న అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-ఆదాయ వనరులు’పై  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ […]

రెండేళ్ల‌లో మిగులు బ‌డ్జెట్
X
అధికారులకు చంద్ర‌బాబు టార్గెట్‌
రెండేళ్ల‌లో రాష్ట్రంలో మిగులుబ‌డ్జెట్ సాధించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు ల‌క్ష్యం నిర్దేశించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇవాళ‌ రూ. 3 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, వచ్చే రెండేళ్లలో ఆదాయ వనరుల‌ను పెంచ‌డం ద్వారా మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయ‌న అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-ఆదాయ వనరులు’పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ తదితరులతో చంద్రబాబు సమీక్షించారు. సమావేశ వివరాలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ విలేకరులకు వెల్లడించారు. వనరుల పెంపు ద్వారా ఆదాయం వస్తున్నా వ్యయం కూడా అంత‌కంటే ఎక్కువగా ఉందని ముఖ్య‌మంత్రి అభిప్రాయపడినట్లు చెప్పారు. ఎర్రచందనం, ఇసుక, బీచ్‌శాండిల్‌, బెరైటీస్ వంటి ఖనిజాల ద్వారా ఖజానాకు ఆదాయం వస్తోందన్నారు. విభ‌జ‌న‌చ‌ట్టంలో పేర్కొన్న రెవెన్యూ లోటు రూ. 6 వేల కోట్లను కేంద్రం ప్రతి ఏటా భర్తీ చేయడం, కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రాయితీలను సాధించుకోవడం ద్వారా లోటును అధిగమించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే రెండేళ్ల ల‌క్ష్యంపై అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఖ‌ర్చులు త‌గ్గించుకోకుండా మిగులు ఎలా సాధ్య‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రులు ఎన్ని ఉన్నా లోటు పూడ్చ‌డం క‌ష్ట‌మ‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
First Published:  12 Aug 2015 12:11 AM GMT
Next Story